Virat Kohli: స్టేడియంలో ‘ఆదిపురుషుడి’ పాట.. రాముడిలా విల్లు ఎక్కుపెట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా?
మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాదు.. సందర్భమొచ్చినప్పుడల్లా ఎంటర్‌టైన్మెంట్‌ను అందించడంలో ముందుంటాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ ఫన్నీ డ్యాన్స్‌లు, ఫీట్లు చేస్తుంటాడీ స్టార్ ప్లేయర్. తాజాగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి తన ఫ్యాన్స్‌ను అలరించాడు కోహ్లీ.
మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాదు.. సందర్భమొచ్చినప్పుడల్లా ఎంటర్‌టైన్మెంట్‌ను అందించడంలో ముందుంటాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ ఫన్నీ డ్యాన్స్‌లు, ఫీట్లు చేస్తుంటాడీ స్టార్ ప్లేయర్. తాజాగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి తన ఫ్యాన్స్‌ను అలరించాడు కోహ్లీ. ఈసారి డ్యాన్స్‌లు గట్రా ఏం చేయేలేదు. అయితే భారతీయుల ఆరాధ్య దైవమైన రాముడిలా అభినయం ప్రదర్శించి అందరి మనసులు గెల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలోని ‘రామ్ సీతా రామ్’ పాటను ప్లే చేశారు. అంతే ఆ పాట చెవిన పడగానే రాముడిలా మారి విల్లు ఎక్కుపెట్టేశాడు విరాట్ కోహ్లీ. అనంతరం చేతులు జోడించి సవినయంగా అందరికీ నమస్కరించాడు. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రాముడిలా విల్లు పెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్ భారత సంతతికి చెందిన వ్యక్తే. అతను హనుమంతుడికి వీర భక్తుడు. అందుకే ఈ మధ్యన కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ కు వచ్చిన ప్రతిసారి ఆదిపురుష్‌లోని ‘రామ్ సీతా రామ్ అనే పాటను ప్లే చేస్తున్నారు. భారత్ తో జరుగుతోన్నరెండో టెస్ట్‌లోనూ ఇదే భక్తి పాటను ప్లే చేశాడు డీజే. దీతో విరాట్ కోహ్లీ రాముడిలా పోజులిచ్చాడు. రఘురాముడిలా మాదిరిగా బాణాన్ని ఎక్కిపెడుతూ నమస్కరించాడు. ఈ పాట ప్లే చేసింది కేశవ్ మహరాజ్ కోసమై కానీ ఇక్కడ కోహ్లీ అందరి మనసులు గెల్చుకున్నాడు.
Virat Kohli folding hands and pulling bow string posing like Shri Ram when ‘Ram Siya Ram’ song played. pic.twitter.com/mm6oR4UaDr
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024
Virat Kohli folding hands and pulling bow string posing like Shri Ram when ‘Ram Siya Ram’ song played. #INDvsSA #Adipurush #Prabhas pic.twitter.com/1XgpQCpIE1
— Prabhas RULES (@PrabhasRules) January 3, 2024
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.
దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బెర్గర్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెన్, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, కీగన్ పీటర్సన్, హంజా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..