Virushka: విరుష్క వివాహ బంధానికి ఐదేళ్లు.. నా ‘మనసంతా నువ్వే’ అంటూ అనుష్కపై ప్రేమను కురిపించిన కోహ్లీ

ఆదివారంతో ఈ క్యూట్‌ కపుల్‌ వివాహ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సతీమణి అనుష్క కి విషెస్‌ చెబుతూ ఇన్‌స్టాలో తమ ఇద్దరి రొమాంటిక్‌ ఫొటోను పంచుకున్నాడు విరాట్

Virushka: విరుష్క వివాహ బంధానికి ఐదేళ్లు.. నా మనసంతా నువ్వే అంటూ అనుష్కపై ప్రేమను కురిపించిన కోహ్లీ
Virushka

Updated on: Dec 11, 2022 | 5:28 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటి (డిసెంబర్‌11)తో ఐదేళ్లు పూర్తయ్యాయి. 2013లో ఓ షాంపు యాడ్‌లో మొదటిసారిగా కలుసుకున్న విరాట్‌, అనుష్క మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. దీంతో ఇరుపెద్దల ఆశీర్వదంతో 2017 డిసెంబరు 11న ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారీ లవ్లీకపుల్‌. ఈ ప్రేమబంధానికి గుర్తింపుగా వామిక అనే కూతురు విరుష్క ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇక కాలంతో పాటు కోహ్లీ, అనుష్కల మధ్య బంధం కూడా బలపడుతోంది. కాగా ఆదివారంతో ఈ క్యూట్‌ కపుల్‌ వివాహ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సతీమణి అనుష్క కి విషెస్‌ చెబుతూ కోహ్లి ఇన్‌స్టాలో తమ ఇద్దరి రొమాంటిక్‌ ఫొటోను పంచుకున్నాడు విరాట్. ‘అంతులేని ప్రయాణంలో ఐదేళ్లు గడిచిపోయాయి.. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. మా మనసంతా నువ్వే. నీపై నా ప్రేమ అజరామరం. నా జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి నువ్వే’ అంటూ భార్యపై ప్రేమను ఒలకపోశాడు.

ఇక అనుష్క సైతం భర్త కోహ్లితో ఉన్న ఫొటోలు పంచుకుంటూ తనదైన శైలిలో విషెస్‌ తెలియజేసింది. ఇందుకు కోహ్లి స్పందిస్తూ.. ‘మై లవ్‌ అంటూ రిప్లూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విరుష్క జోడికి సంబంధించిన పోస్టులు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విరుష్క(#virushka)జంట పేరు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది. ఇక మన రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 72వ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక అనుష్క మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై మెరవడానికి సిద్ధంగా ఉంది. టీమిండియా మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చక్దా ఎక్స్‌ప్రెస్‌లో అనుష్క టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. త్వరలోనే ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..