AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఆ విషయం మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.. అందుకే కెప్టెన్సీ వదులుకున్నా: విరాట్ కోహ్లీ

తన చివరి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత, కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ, జట్టు ప్రదర్శన, సహాయక సిబ్బంది పాత్ర వంటి అనేక విషయాల గురించి మాట్లాడాడు.

Virat Kohli: ఆ విషయం మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.. అందుకే కెప్టెన్సీ వదులుకున్నా:  విరాట్ కోహ్లీ
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 09, 2021 | 10:59 AM

Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2021లో నమీబియాతో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో ఆటగాడిగా మాత్రమే టీమ్ ఇండియాలో భాగం కానున్నాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో నమీబియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత, విరాట్ తన టీ20 కెప్టెన్సీ, జట్టు ప్రదర్శన, సహాయక సిబ్బంది పాత్రతో సహా అనేక అంశాలపై మాట్లాడాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఓ విషయంపై చాలా విషయాలు వెల్లడించాడు. అదే పనిభారం. విరాట్ మ్యాచ్ అనంతరం కాన్ఫరెన్స్‌లో వర్క్‌లోడ్‌పై స్పందించాడు. తన పనిభారంపై మాట్లాడేందుకు ఇదే సరైన సమయం అని పేర్కొన్నాడు. గత 6-7 ఏళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తాను నిరంతరం మైదానంలో ఉండాల్సి వచ్చిందని, అది తన శరీరంపై ప్రభావం చూపుతోందని తెలిపాడు. అయితే ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత పనిభారాన్ని తగ్గుతుందని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీ20 కెప్టెన్సీ గ్రాఫ్‌పై.. టీ20 కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడిన తర్వాత, విరాట్ తన ప్రదర్శనపై మాట్లాడుతూ, “మొదట నేను ఉపశమనం పొందుతున్నాను. ఇది గౌరవానికి సంబంధించిన విషయం. కానీ, అన్ని విషయాలను సరైన కోణం నుంచి చూడాలి. ఒక టీమ్‌గా మేం చాలా బాగా ప్రదర్శన చేయడం చాలా బాగుంది. ఈ ప్రపంచకప్‌లో మేం సెమీస్‌కు చేరలేదని నాకు తెలుసు. కానీ, టీ20 క్రికెట్‌లో మేము కొన్ని మంచి ఫలితాలు సాధించాం. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో మొదటి రెండు ఓవర్లు బాగా ఆడిఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని విరాట్ పేర్కొన్నాడు.

శాస్త్రి, సహాయక సిబ్బందికి విరాట్ వీడ్కోలు.. తన కెప్టెన్సీలో జట్టును విజయవంతం చేయడంలో సహకరించిన రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందికి విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతూ, “కొన్ని ఏళ్లుగా అద్భుతమైన విజయాలు సాధించి, జట్టును కలిసి ఉంచిన ఈ వ్యక్తులందరికీ ధన్యవాదాలు. టీం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అద్భుతంగా ఉంచారు” అని విరాట్ తెలిపాడు.

Also Read: Virat Kohli: టీ20తోపాటు వన్డే, టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకోవాలా?.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..!

Virat Kohli: నీ ఆటకు మేమంతా ఫిదా.. నువ్వే మా యువకులకు కొండంత అండ: కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్వీట్లు