Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కౌగిలింతలతో వీడ్కోలు.. చివరి మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ-రవిశాస్త్రి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Virat Kohli-Ravi Shastri: తమ చివరి టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌లో నమీబియాపై భారత్ విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ కోహ్లి ప్రధాన కోచ్ శాస్త్రిని, తర్వాత స్పిన్నర్ ఆర్. అశ్విన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లను కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

Watch Video: కౌగిలింతలతో వీడ్కోలు.. చివరి మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ-రవిశాస్త్రి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Virat Kohli Ravi Shastri
Follow us
Venkata Chari

|

Updated on: Nov 09, 2021 | 10:52 AM

Virat Kohli-Ravi Shastri: తమ చివరి టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌లో నమీబియాపై భారత్ విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ కోహ్లి ప్రధాన కోచ్ శాస్త్రిల శకం ముగిసింది. అయితే విరాట్ కోహ్లి, రవిశాస్త్రి కాంబినేషన్‌కి ఇది మంచి ముగింపునిచ్చిందా? అంటే మాత్రం ఐసీసీ టోర్నమెంట్ల పరంగా, ఇది ఖచ్చితంగా బాగోలేదు. అయితే నమీబియాతో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కోహ్లీ, శాస్త్రి కౌగిలించుకుని తమ ప్రయాణాలకు ముగింపు పలికారు. అయితే ఎనిమిదేళ్లలో మొదటిసారి భారత్‌ను ఐసీసీ నాకౌట్‌లకు తీసుకెళ్లనందుకు వారు బాధపడతున్నారనే విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా తరుపున అత్యంత విజయవంతమైన కెప్టెన్-కోచ్ ద్వయంలో ఒకరిగా గుర్తుండిపోనున్నరానే విషయం కూడా వారికి తెలుసు.

భారత్‌కు సెమీ-ఫైనల్‌కు చేరే అవకాశం లేదు. కోహ్లీ, శాస్త్రి ఇద్దరూ కలిసి వారి ప్రయాణం ఈ మ్యాచ్‌తోనే ముగిసిందని తెలిసిన విషయమే. సోమవారం దుబాయ్‌లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత స్పిన్నర్‌ ఆర్‌ అశ్విన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తర్వాత భారత కెప్టెన్‌ కోహ్లి హెడ్‌ కోచ్‌ శాస్త్రిని కౌగిలించుకోవడం కెమెరాల్లో చిక్కుకోవడంతో భావోద్వేగాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు కూడా తమ కామెంట్లతో ఈ ద్వయానికి వీడ్కోలు పలికారు.

భారత టీ20ఐ కెప్టెన్‌గా కోహ్లీకి ఇది చివరి మ్యాచ్. అలాగే భారత కోచింగ్ సిబ్బందిగా శాస్త్రి, అరుణ్‌లకు చివరి రోజు. అందువల్ల మ్యాచ్ ముగిసిన అనంతరం వీరంతా భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ మేరకు ఐసీసీ కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేసింది.

అయితే నమీబియాకు వ్యతిరేకంగా కెప్టెన్‌గా చివరిసారి బ్యాటింగ్ చేయకపోవడం గమనార్హం. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, సహాయక సిబ్బందిని ఒక పెద్ద కుటుంబం అని అభివర్ణించాడు. వీరంతా భారత క్రికెట్‌కు ఎంతో సహాయపడ్డారని పేర్కొన్నాడు.

రవిశాస్త్రి స్థానంలో న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, భారత టీ20ఐ కెప్టెన్‌గా కోహ్లీ నుంచి రోహిత్ శర్మ ఖచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ల స్థానంలో నవంబర్ 17న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అతని స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Also Read: Virat Kohli: ఆ విషయం మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.. అందుకే కెప్టెన్సీ వదులుకున్నా: విరాట్ కోహ్లీ

Virat Kohli: నీ ఆటకు మేమంతా ఫిదా.. నువ్వే మా యువకులకు కొండంత అండ: కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్వీట్లు