Ravi Shastri Sign Off Speech: బరువెక్కిన హృదయంతో హెడ్ కోచ్ రవిశాస్త్రి చివరి సందేశం.. ఏమన్నాడంటే?
Watch Video: భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఆటగాళ్లు తమ బరువెక్కిన గుండెలతో వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భాల్లో '70 సెకన్లు' మాట్లాడిన శాస్త్రి.. ఏమన్నాడంటే?
Ravi Shastri Sign Off Speech: 4ఏళ్ల ప్రయాణం ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీల ప్రయాణం నమీబియాతో జరిగిన మ్యాచుతో పూర్తయ్యింది. టీ20 కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్ ఆడిన కోహ్లీ, ఈ మ్యాచ్ అనంతరం పొట్టి పార్మాట్‌లో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర సిబ్బంది పదవీకాలం ముగిసింది. దీంతో టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగాలకు నిలయంగా మారింది. రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాన కోచ్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ (ఆర్. శ్రీధర్)ని కూడా కౌగిలించుకున్నాడు. నిజానికి రవిశాస్త్రితో పాటు వీరిద్దరి పదవీకాలం కూడా టీమ్ ఇండియాతో ముగిసింది. హాట్ హాట్ గా ఉండే డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో మాత్రం బరువెక్కింది. ఇలాంటి బరువైన గుండెలతోనే రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో 70 సెకన్ల పాటు మాట్లాడాడు.
ఆటగాళ్లతో రవిశాస్త్రి మాట్లాడుతూ..’ ఐసీసీ టైటిల్ గెలవనందుకు చింతిస్తున్నాను. అయితే అదే సమయంలో ఈ టీమ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ జట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటూ గెలుస్తున్నారు. తొలి ఆటగాళ్లను చూసి నేర్చుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి అందించిన వీడ్కోలు ప్రసంగానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach ? ?
Here’s a snippet from @RaviShastriOfc‘s team address in the dressing room, reflecting on the team’s journey in the last few years. ? ? #T20WorldCup #INDvNAM
Watch ? ?https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp
— BCCI (@BCCI) November 9, 2021
Virat Kohli: ఆ విషయం మాట్లాడేందుకు ఇదే సరైన సమయం.. అందుకే కెప్టెన్సీ వదులుకున్నా: విరాట్ కోహ్లీ