AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘సచిన్ సలహాలు తీసుకో.. లేదంటే మరిన్ని పరాభవాలు ఎదురుకావొచ్చు’: విరాట్ కోహ్లీకి సూచించిన భారత మాజీ దిగ్గజం

Virat Kohli vs James Anderson: అండర్సన్ మరోసారి విరాట్ కోహ్లీపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌పై కోహ్లీ నిలబడలేకపోవడం ఇది రెండోసారి.

Virat Kohli: 'సచిన్ సలహాలు తీసుకో.. లేదంటే మరిన్ని పరాభవాలు ఎదురుకావొచ్చు': విరాట్ కోహ్లీకి సూచించిన భారత మాజీ దిగ్గజం
Virat Kohli
Venkata Chari
|

Updated on: Aug 26, 2021 | 8:32 AM

Share

Virat Kohli vs James Anderson: హెడింగ్లీలో జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు విరాట్ కోహ్లీ తన శత్రువు జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో కేవలం ఏడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అండర్సన్ మరోసారి విరాట్ కోహ్లీపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌పై కోహ్లీ నిలబడలేకపోవడం ఇది రెండోసారి. అదే సమయంలో, 2012 నుంచి అండర్సన్ మొత్తం ఏడు సార్లు కోహ్లీని బాధితుడిగా మార్చుకున్నాడు. అండర్సన్ 2016, 2018 లో రెండుసార్లు కోహ్లీ వికెట్ తీయలేకపోయాడు. కానీ, 2021 లో అండర్సన్ ప్రతాపం చూపించాడు. 2012 లో ఆండర్సన్ కోహ్లీకి 81 బంతులు సంధించి, కేవలం ఒకసారి మాత్రమే ఔట్ చేశాడు.

ఇలా కోహ్లీ ఘోరంగా విఫలమువుతుండడంతో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీకి ఓ చక్కని సూచన చేశాడు. ఇప్పటికైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకుంటే బాగుటుంది. 2004లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాతో చేసిన అద్భుత ప్రదర్శన నుంచి స్ఫూర్తి పొందాలని సునీల్ గవాస్కర్ కోరారు.

ఈ మేరకు ” సచిన్ రమేష్ టెండూల్కర్‌కి త్వరగా కాల్ చేసి, సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది. అలాగే కవర్ డ్రైవ్ ఆడటంపై ప్రత్యేకంగా సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది” అంటూ చెప్పుకొచ్చాడు. సిడ్నీలో సచిన్ టెండూల్కర్ చేసినట్లు కోహ్లీ కూడా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాలని కోరాడు. బుధవారం హెడింగ్లీలో జరిగిన మూడవ టెస్ట్‌లో మొదటి రోజు కేవలం ఏడు పరుగులకే కోహ్లీ తన శత్రువు జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్‌ వెలుపల డెలివరీ చేసిన బంతిని విరాట్ కోహ్లీ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి, వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు చిక్కాడు.

23 టెస్టుల్లో ఏడవసారి అండర్సన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్ పేసర్ ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్‌తో పాటు కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా అవతరించాడు. భారత కెప్టెన్ ప్రస్తుతం మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. టెస్ట్ క్రికెట్‌లో మొట్టమొదటి 10,000 పరుగుల మార్క్ సాధించిన కోహ్లీ.. ఆఫ్-స్టంప్ వెలుపల డెలివరీలను ఛేజ్ చేయకపోవడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని భారత మాజీ ఓపెనర్, కెప్టెన్ చెప్పాడు.

“ఇది నాకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే కోహ్లీ తక్కువ స్కోర్‌కే డిస్మిస్ అవుతున్నాడు. 2014 లో ఆఫ్-స్టంప్ బాల్స్‌ను వెంటాడలేకే ఎక్కువ సార్లు పెవిలియన్ చేరాడు” అని గవాస్కర్ తెలిపాడు. 2003-04 సిరీస్‌లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టెండూల్కర్ చాలా ఓపికగా ఆడారు. తన సహజశైలికి భిన్నంగా పరుగులు సాధించాడు. తన 613 నిమిషాల ఆటలో 436-బాల్స్‌ను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో కవర్ డ్రైవ్ ఆడలేదు. అయినా అజేయంగా 241 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 705/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ విషయాన్ని కోహ్లీ గుర్తుకు తెచ్చుకుని, సచిన్ ఆటతో స్ఫూర్తి తెచ్చుకోవాలని సూచించాడు.

Also Read: India Vs England: ముగిసిన తొలిరోజు ఆట.. 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..

అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్.. పేలవ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కోహ్లీ సేన

Virat Kohli Wins Toss: విరాట్ కోహ్లీ టాస్ కొరత తీరింది.. కానీ, మ్యాచ్ ఫలితంపై వెంటాడుతున్న భయం