Virat Kohli Wins Toss: విరాట్ కోహ్లీ టాస్ కొరత తీరింది.. కానీ, మ్యాచ్ ఫలితంపై వెంటాడుతున్న భయం
హెడింగ్లీలో విరాట్ కోహ్లీ టాస్‌కి బాస్‌గా మారాడు. ఎన్నో ఎళ్లగా ఎదురుచూస్తోన్న టాస్‌ను ఎట్టకేలకు గెలిచాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్‌లో గెలిచి తమ ఆధిక్యాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ..
Ind vs Eng: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ ప్రస్తుతం హెడింగ్లీలోని లీడ్స్ మైదానంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోంది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య టీంపై గెలచి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. మూడో టెస్టులో విజయం సాధించి తమ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉంటాడు. కానీ, అంతకు ముందు కోహ్లీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆనందాన్ని లీడ్స్‌లో పొందాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచి తన కొరతను తీర్చుకున్నాడు.
టాస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. టాస్ గెలిచే విషయంలో విరాట్ చాలా అదృష్టవంతుడు కూడా కాదు. ఎందుకంటే చాలా సార్లు టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు, నాటింగ్‌హామ్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, కోహ్లీ టాస్ ఓడిపోయాడు. అనంతరం లార్డ్స్ మైదానంలో కూడా టాస్ గెలవలేదు. కానీ, మ్యాచ్ గెలిచారు. ప్రస్తుత మూడో టెస్టు జరుగుతోన్న లీడ్స్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. దానితో పాటు ఇంగ్లండ్ భూమిపై తనకున్న సుదీర్ఘ కరువును తీర్చుకున్నాడు. విరాట్ ఇంతకుముందు ఇంగ్లండ్‌లో ఎనిమిది సార్లు టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఏ మ్యాచులోనూ టాస్ గెలవలేకపోయాడు. అతను ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలో టాస్ గెలవలేదు, కానీ, ఈసారి కథ మారిపోయింది. అతను ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలవగలిగాడు.
టాస్ గెలిచాడు.. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరమైన దెబ్బ.. విరాట్ కోహ్లీకి టాస్ గెలిచిన ఆనందం కొద్దిసేపు కూడా మిగలలేదు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటిగా టీమిండియా పేకమేడలా కూలిపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే.. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్స్ పేకమేడలా కుప్పకూలారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయ్యారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో మిగతా 27 పరుగులు చేసి చాపచుట్టేసింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా తరపున రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలవగా రహానె 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను చావుదెబ్బ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ టీం కడపటి వార్తలు అందేసరికి 58 పరుగులకు చేరుకుంది. రోర్నీ బర్న్ 23 పరుగులు, హమీద్ 32 పరుగులతో క్రీజులో నిలిచారు. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read:
MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు ‘తలా’ రెడీ.. నెట్స్ బాదుడే బాదుడు..
IND Vs ENG: విజృంభించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కుప్పకూలిన కోహ్లీసేన.. 78 పరుగులకే ఆలౌట్..