India Vs England: ముగిసిన తొలిరోజు ఆట.. 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లాండ్..

India Vs England: ముగిసిన తొలిరోజు ఆట.. 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..
England
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2021 | 12:07 AM

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌(52), హసీబ్‌ హమీద్‌(60) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. చెత్త బంతులను వదిలిస్తే చక్కటి షాట్స్‌తో భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

కాగా, అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్‌మెన్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే పెవిలియన్ చేరారు. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

ముఖ్యంగా ఆండర్సన్ కీలక వికెట్లు పడగొట్టి.. టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్(0), పుజారా(1), విరాట్ కోహ్లీ(7)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహనే(18), రోహిత్ శర్మ(19)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నా.. ఇంగ్లాండ్ పేసర్లు వారిని క్రీజులో కుదురుకోకుండా చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తప్పితే మరెవ్వరూ కూడా రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్, కర్రన్ రెండేసి వికెట్లు తీశారు.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్