IND vs ENG: లండన్ వేటకు కింగ్ కోహ్లీ రెడీ..! ఇంగ్లాండ్ గడ్డపై 15 ఏళ్ల కరువు తీరినట్టేనా..?

Virat Kohli Fitness Test: విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అవ్వడం భారత జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చే అంశం. లండన్ వేదికగా సాగే ఈ సమరంలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రికార్డుల వేటను కొనసాగించడమే కాకుండా భారత్‌కు చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందిస్తాడని ఆశిద్దాం.

IND vs ENG: లండన్ వేటకు కింగ్ కోహ్లీ రెడీ..! ఇంగ్లాండ్ గడ్డపై 15 ఏళ్ల కరువు తీరినట్టేనా..?
Virat Kohli Fitness Test

Updated on: Jun 22, 2026 | 10:39 PM

Virat Kohli Fitness Test: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశలో గాయపడి క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ, తాజాగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన కీలకమైన ఫిట్‌నెస్ పరీక్షలో విజయం సాధించాడు. దీంతో వచ్చే నెలలో ఇంగ్లాండ్ గడ్డపై జరగబోయే వన్డే సిరీస్‌లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది.

అభిమానుల్లో జోష్.. గాయం నుంచి కోలుకున్న రారాజు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీకి తొడకండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) అయింది. ఈ గాయం కారణంగానే అతడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో కోహ్లీ పేరును చేర్చినప్పటికీ, అతడి ఎంపిక అనేది ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. తాజాగా సోమవారం జరిగిన ఈ ఫిట్‌నెస్ పరీక్షను కింగ్ కోహ్లీ విజయవంతంగా పూర్తి చేయడంతో సెలెక్టర్లతో పాటు కోట్లాది మంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

ఇవి కూడా చదవండి

మూడో నంబర్‌లో కింగ్ రీఎంట్రీ.. మారనున్న సమీకరణాలు..

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సాధించడంతో ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో భారత టాప్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా మారనుంది. భారత క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఇంగ్లాండ్‌పై టాప్ ఆర్డర్‌లో ఎటువంటి ప్రయోగాలు ఉండవు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలు ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండగా, విరాట్ కోహ్లీ తన సంప్రదాయ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. కోహ్లీ జట్టులోకి రావడంతో, గత సిరీస్‌లో అతడి స్థానంలో ఆడి శతకం బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు.

15 వేల పరుగుల మైలురాయిపై కన్ను..!

ఈ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయికి వేదిక కానుంది. వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగుల మార్కును అందుకోవడానికి కోహ్లీ కేవలం 203 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతమున్న ఫామ్ ప్రకారం మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోనే కింగ్ కోహ్లీ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌లు కూడా జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు అదనపు బలాన్ని ఇస్తోంది.

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us