న్యూజిలాండ్‌లోని ఓ కేఫ్ నుంచి కోహ్లీ అనుష్కలను వెళ్లిపోమన్నారు! షాకింగ్ న్యూస్ చెప్పిన భారత క్రికెటర్
న్యూజిలాండ్‌లోని కేఫ్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 4 గంటల పాటు గడిపారు. జెమిమా రోడ్రిగ్స్ వెల్లడించిన ఈ విషయం ప్రకారం, కేఫ్ మూసివేసే సమయం అయినందున వారిని బయటకు వెళ్ళమని నిర్వాహకులు కోరారు. కోహ్లీ-అనుష్క జంట, జెమిమా మరియు స్మృతి మంధానలతో కలిసి క్రికెట్, వ్యక్తిగత జీవితం గురించి చర్చించారు.

టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కోహ్లీని అభిమానిస్తారు. అలాంటి కోహ్లీని న్యూజిలాండ్‌లో ఓ కేఫ్ నిర్వాహకులు కేఫ్ నుంచి వెళ్లిపోవాలని కోరారంటా..! ఈ విషయాన్ని స్వయంగా ఓ మహిళా క్రికెటర్ వెల్లడించారు. ఇంతకీ కోహ్లీ, అనుష్కలను ఎందుకు కేఫ్ నుంచి వెళ్లిపోమన్నారు? ఈ విషయం చెప్పింది ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ సారి న్యూజిలాండ్‌లో భారత మహిళా జట్టు పర్యటించింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఆ దేశంలోనే ఉన్నారు. దీంతో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కోహ్లీని ఓ కేఫ్‌కు ఆహ్వానించింది. ఆమె ఆహ్వానం మేరకు కోహ్లీతో పాటు అనుష్క కూడా వచ్చింది. రోడ్రిగ్స్‌తో పాటు స్టార్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మంధాన కూడా కోహ్లీ, అనుష్కను కలిశారు. అలా ఈ నలుగురు కలిసి ఆ కేఫ్‌లో ముచ్చటించుకున్నారు. క్రికెట్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గ్రోత్ గురించి అబ్బో ఇలా చాలా విషయాలపై వాళ్లు టైమ్ తెలియకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారంటా.. అలా వాళ్లు ఏకంగా 4 గంటల పాటు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
దాంతో కేఫ్ నిర్వాహకులు వారిని అక్కడి నుంచి వెళ్లాలని, కేఫ్ మూసే టైమ్ అయిపోయిందని కోరడంతో కోహ్లీ, అనుష్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారని జెమియా రోడ్రిగ్స్ వెల్లడించింది. మాషబుల్ ఇండియా యూట్యూబ్ సిరీస్ ది బాంబే జర్నీలో కనిపించిన రోడ్రిగ్స్ ఈ విషయాన్ని తెలిపింది. కాగా విరుష్క జంట మొదటిసారి 2013లో ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సందర్భంగా కలుసుకున్నారు. ఆ తర్వాత స్నేహం, ప్రేమగా మారి.. ఆ బంధం డిసెంబర్ 2017లో ఇటలీలో వారి వివాహంతో మరింత బలపడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




