AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ పెట్టిన అతి తక్కువ పెట్టుబడికి, వైభవ్ ఇస్తున్న రిటర్న్స్ చూసి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తుంటే, ఫ్రాంచైజీకి కోట్ల రూపాయల లాభం చేకూరుతోంది.

Vaibhav Suryavanshi :  పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Apr 11, 2026 | 12:56 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొచ్చే వేదిక. కానీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం కేవలం స్టార్‌డమ్‌కు మాత్రమే సంబంధించింది కాదు.. ఇది అసలైన ‘వాల్యూ’కు సంబంధించినది. రాజస్థాన్ రాయల్స్ పెట్టిన అతి తక్కువ పెట్టుబడికి, వైభవ్ ఇస్తున్న రిటర్న్స్ చూసి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తుంటే, ఫ్రాంచైజీకి కోట్ల రూపాయల లాభం చేకూరుతోంది.

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఒక వరంలా మారాడు. సాధారణంగా భారీ ధర పెట్టి కొన్న స్టార్లు విఫలమవుతుంటే, కేవలం రూ.23.57 లక్షల స్వల్ప ధరకు దక్కిన వైభవ్, మైదానంలో కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల కంటే అద్భుతంగా రాణిస్తున్నాడు. హెచ్‌టీ (HT) నివేదిక ప్రకారం, అతను ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లలో అతని ప్రదర్శన విలువ దాదాపు ₹3.77 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే, రాజస్థాన్ పెట్టిన పెట్టుబడికి దాదాపు 16 రెట్లు ఎక్కువ లాభాన్ని కేవలం మూడు మ్యాచ్‌లలోనే ఈ కుర్రాడు తిరిగి ఇచ్చేశాడన్నమాట.

మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసం 

వైభవ్ కేవలం అదృష్టంతో పరుగులు చేయడం లేదు, అతనిలో కరుడుగట్టిన ఆక్రమణ కనిపిస్తోంది.

చెన్నై (CSK) పై: 17 బంతుల్లో 52 పరుగులు (లాభం: రూ.1.32 కోట్లు)

గుజరాత్ (GT) పై: 18 బంతుల్లో 31 పరుగులు (లాభం: రూ.75 లక్షలు)

ముంబై (MI) పై: 14 బంతుల్లో 39 పరుగులు (లాభం: రూ.1.47 కోట్లు)

మొత్తంగా చూస్తే, అతను సాధించిన 122 పరుగులలో 106 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. అతని 248.97 స్ట్రైక్ రేట్ చూస్తుంటే బౌలర్లు ఎవరనేది అతనికి అనవసరమనిపిస్తోంది.

బుమ్రాకే ఎదురుదాడి

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ వైభవ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదడం ఒక ఎత్తైతే, ఆ ఇన్నింగ్స్ మొత్తం ఎక్కడా తడబడకుండా ఆడటం మరో ఎత్తు. వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనవ్వకుండా 39 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతను కేవలం ఒక యువ ఆటగాడిగా కాకుండా, మ్యాచ్ విన్నర్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ కు జాక్‌పాట్

ఒక ప్లేయర్ మీద పెట్టిన పెట్టుబడికి ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ స్థాయిలో రిటర్న్స్ రావడం ఐపీఎల్ చరిత్రలో చాలా అరుదు. వైభవ్ సూర్యవంశీ ఆడే ప్రతి ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వాల్యూను కూడా పెంచుతోంది. కేవలం తన ప్రతిభతోనే కాకుండా, జట్టుకు ఆర్థికంగా, పాయింట్ల పరంగా అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాడు. ఈ సీజన్ ముగిసేలోపు వైభవ్ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడతాడో, రాజస్థాన్ కు ఇంకెన్ని కోట్లు కురిపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us