Asia Cup 2025: ఆసియాకప్‌లో వైభవ్ సూర్యవంశీ.. ఏకంగా టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి..?

Vaibhav Suryavanshi: ఆసియా కప్ 2025 కోసం రాబోయే రోజుల్లో భారత జట్టును ప్రకటించనున్నారు. దీనికి ముందు, 1983 ప్రపంచ కప్ విజేత ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక ప్రకటన చేశాడు. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేయడం గమనార్హం.

Asia Cup 2025: ఆసియాకప్‌లో వైభవ్ సూర్యవంశీ.. ఏకంగా టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి..?
Vaibhav Suryavanshi

Updated on: Aug 18, 2025 | 2:31 PM

Vaibhav Suryavanshi: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. టీమ్ ఇండియా ఎంపికకు ముందు 1983 ప్రపంచ కప్ విజేత, మాజీ భారత ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 2025 ఆసియా కప్ కోసం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసియా కప్ కోసం తనకు ఇష్టమైన ఓపెనింగ్ జోడీని ఆయన వెల్లడించారు. అందులో సంజు శాంసన్ పేరు చేర్చకపోవడం గమనార్హం.

వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్‌లో ఆడతాడా?

కృష్ణమాచారి శ్రీకాంత్ యువ స్టార్లు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సాయి సుదర్శన్‌లను భారత ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకోవడానికి మద్దతు ఇచ్చారు. అదే సమయంలో, సంజు శాంసన్‌లను ఓపెనింగ్ పాత్ర నుంచి దూరంగా ఉంచాలని ఆయన సలహా ఇచ్చారు. శ్రీకాంత్ చేసిన ఈ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ చీకి చీకాలో అభిషేక్ శర్మ తన మొదటి ఎంపిక అని, అతన్ని ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాటర్‌గా ఎంపిక చేసుకోవాలని అన్నారు. అతని భాగస్వామి కోసం, శ్రీకాంత్ యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లేదా వైభవ్ సూర్యవంశీలలో ఒకరిని ఎంచుకోవాలని సూచించారు.

కృష్ణమాచారి శ్రీకాంత్ సంజు శాంసన్‌ను ఓపెనింగ్ పోటీదారుగా పరిగణించలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శామ్సన్ షార్ట్ బాల్స్‌పై బలహీనంగా ఉన్నట్లు తేలింది. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ ‘ చీకీ చీకా’లో మాట్లాడుతూ, ‘ ఇంగ్లాండ్‌తో జరిగిన షార్ట్ బాల్‌పై సంజు శాంసన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. నా అభిప్రాయం ప్రకారం, అతను ఓపెనింగ్ చేయడం కష్టం. నేను సెలెక్టర్ అయితే, అభిషేక్ శర్మ నా మొదటి ఎంపిక. రెండవ ఎంపిక, నేను వైభవ్ సూర్యవంశీ లేదా సాయి సుదర్శన్‌ను ఎంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్..

వైభవ్ సూర్యవంశీ గురించి కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘ నా 15 మంది సభ్యుల జట్టులో వైభవ్ సూర్యవంశీని కూడా చేర్చుకుంటాను. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అతను, యశస్వి జైస్వాల్ చాలా బాగా రాణిస్తున్నారు. కాబట్టి, సుదర్శన్, సూర్యవంశీ లేదా జైస్వాల్‌లలో ఒకరు అభిషేక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది నా ఎంపిక. శాంసన్, జితేష్ శర్మలలో ఒకరిని వికెట్ కీపర్ -బ్యాట్స్ మాన్‌గా ఎంచుకోవచ్చు’ అని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..