AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నోఎంట్రీ.. ఇంగ్లాండ్ టూర్‌లో వింత నిబంధన.. కారణం ఏంటంటే?

Vaibhav Sooryavanshi Team India Dressing Room: చిన్న వయసులోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగిన వైభవ్ సూర్యవంశీకి ఈ అంతర్జాతీయ నిబంధనలు కొత్త అనుభవాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో ఈ వండర్ కిడ్ బరిలోకి దిగితే, భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. చట్టాలు ఏవైనా, మైదానంలో తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడానికి ఈ బీహార్ కుర్రాడు ఉవ్విళ్లూరుతున్నాడు.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నోఎంట్రీ.. ఇంగ్లాండ్ టూర్‌లో వింత నిబంధన.. కారణం ఏంటంటే?
Vaibhav Sooryavanshi Team India Dressing Room
Venkata Chari
|

Updated on: Jun 24, 2026 | 9:59 PM

Share

Vaibhav Sooryavanshi Team India Dressing Room: భారత క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సరికొత్త చర్చకు తెరలేపాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల వరద పారించి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ ఆటగాడికి ఇంగ్లాండ్ పర్యటనలో ఒక వింత అనుభవం ఎదురుకానుంది. సిరీస్ జరుగుతున్న సమయంలో అతను సహచర ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడానికి వీల్లేదని ఐసీసీ, ఈసీబీ స్పష్టం చేశాయి.

ఇంగ్లాండ్ వేదికలపై ప్రత్యేక గదులు.. ఎందుకంటే..?

భారత సీనియర్ జట్టుతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సిద్ధమయ్యాడు. అయితే, బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టాక అతను జట్టులోని ఇతర సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో బట్టలు మార్చుకోవడానికి ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్), ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) నిబంధనలు అంగీకరించడం లేదు. ఈ సిరీస్ ఐసీసీ నిబంధనల పరిధిలోకి రావడం, ఇంగ్లాండ్‌లో ‘చైల్డ్ సేఫ్‌గార్డింగ్’ (బాలల రక్షణ మార్గదర్శకాలు) చట్టాలు చాలా కఠినంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

ఇది కూడా చదవండి: IRE vs IND: వైభవ్‌తో ఓపెనింగ్ చేసేది అతడే.. పవర్ ప్లేలోనే ఒక్కొక్కడి ప్యాంట్లు తడిచిపోవడం పక్కా..!

బ్రిటీష్ నిబంధనల ప్రకారం 16 ఏళ్ల లోపు ఉన్న మైనర్ ఆటగాళ్లు ఎవరైనా సరే, పెద్దవారితో కలిసి కామన్ చేంజింగ్ రూమ్‌లను ఉపయోగించకూడదు. ఈ చట్టం కారణంగా వైభవ్ సూర్యవంశీ కోసం మ్యాచ్ జరిగే ప్రతి స్టేడియంలోనూ ప్రత్యేకంగా విడిగా చేంజింగ్ రూమ్ వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత అతను బట్టలు మార్చుకోవడానికి మాత్రమే ఈ ప్రత్యేక గదిని కేటాయిస్తారు.

సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువలో..

“మావద్ద దశాబ్దాల తర్వాత 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన అద్భుతమైన ప్రతిభావంతుడు ఉన్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అంత చిన్న వయసు పిల్లోడు సీనియర్ల వాతావరణంలో ఇమడటం కాస్త కష్టమే. అందుకే వైభవ్‌కు తోడుగా అతని తల్లిదండ్రులను కూడా ఈ టూర్‌కు పంపుతున్నాం” అంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ సమయంలో ఇబ్బంది లేదు..!

ఈ ఆంక్షలు కేవలం బట్టలు మార్చుకునే సమయానికి మాత్రమే పరిమితం కానున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చోవచ్చు. అలాగే జట్టు వ్యూహాత్మక సమావేశాల్లో, కోచ్ ఇచ్చే సలహాల్లో నిర్భయంగా పాల్గొనవచ్చు. కేవలం మైదానంలోకి దిగే ముందు, వచ్చాక దుస్తులు మార్చుకునే విషయంలోనే ఈ ‘సేఫ్‌గార్డింగ్’ ప్రోటోకాల్స్ అమలులో ఉంటాయి. గతంలో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్‌కు చెందిన 15 ఏళ్ల యువ ప్లేయర్ మాక్స్ డోమన్ కూడా 16 ఏళ్లు నిండేవరకు ఇలాగే విడిగా చేంజింగ్ రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Team India: వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి.. టీమిండియా శతృవుకి ఇచ్చిపడేసిన దాదా..!

బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు..

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు వైభవ్‌కు ఇలాంటి ఆంక్షలు ఎదురుకాలేదు. భారత దేశీయ క్రికెట్‌లో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అతను సీనియర్లతో కలిసే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ చట్టాలను గౌరవించాల్సి రావడంతో, బీసీసీఐ సైతం వైభవ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అతను హోటల్‌లో ఉండేందుకు, ప్రయాణించేందుకు వీలుగా అతని తల్లిదండ్రుల ప్రయాణ, వసతి ఖర్చులను బోర్డే భరిస్తోంది. వారు కూడా జట్టు బస చేసే హోటల్‌లోనే వైభవ్‌కు తోడుగా ఉంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!