AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2024: సెమీ ఫైనల్ చేరిన 4 జట్లు.. టీమిండియా ప్రత్యర్థి ఎవరంటే?

U19 World Cup 2024 Semifinal Schedule: సూపర్ 6లో భారత్ గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉంది. అదే గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచిన పాకిస్థాన్ కూడా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో పాటు 2వ గ్రూప్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచాయి. ఇప్పుడు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరగనున్నాయి.

U19 World Cup 2024: సెమీ ఫైనల్ చేరిన 4 జట్లు.. టీమిండియా ప్రత్యర్థి ఎవరంటే?
U19 Wc Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Feb 04, 2024 | 6:34 AM

Share

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ICC అండర్-19 ప్రపంచ కప్ 2024 (ICC Under-19 World Cup 2024) సూపర్ 6 రౌండ్‌లో, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను (Pakistan vs Bangladesh) ఓడించి సెమీ-ఫైనల్ టిక్కెట్‌ను దక్కించుకుంది. దీంతో పాటు ప్రస్తుత టోర్నీలో నాలుగు సెమీఫైనల్ జట్లు కూడా ఖాయమయ్యాయి. సూపర్ 6లో టీమ్ ఇండియా (Team India) గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ కూడా అదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో పాటు 2వ గ్రూప్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచాయి. ఇప్పుడు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరగనున్నాయి.

గెలిచిన పాక్..

సూపర్ సిక్స్ రౌండ్ చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచినా.. ఈ విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 155 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటయి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ 38.1 ఓవర్లలో విజయం సాధించి ఉంటే సెమీఫైనల్‌కు టికెట్‌ బుక్‌ చేసుకునేది. కానీ, ఆ జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

టీమ్ ఇండియా ఓటమి ఎరుగలే..

ఫిబ్రవరి 11న సెమీ ఫైనల్స్‌లో రెండు విజేతలు తలపడతారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ ఇండియా ఓటమి ఎరుగలేదు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ 6 రౌండ్‌లో భారత్, న్యూజిలాండ్, నేపాల్‌లను ఓడించి సెమీఫైనల్ టిక్కెట్‌ను దక్కించుకుంది.

సెమీ ఫైనల్స్ పూర్తి షెడ్యూల్..

గ్రూప్ స్టేజ్ తర్వాత ఒక్కో గ్రూప్ నుంచి 3 జట్లు సూపర్ 6కి చేరుకున్నాయి. ఆ తర్వాత గ్రూప్ A, గ్రూప్ D నుంచి 3 జట్లను గ్రూప్ 1 గా విభజించారు. గ్రూప్ B, C నుంచి 3 జట్లను గ్రూప్ 2 గా విభజించారు. సూపర్ సిక్స్‌లో రెండు గ్రూపుల నుంచి ఒక్కో జట్టు 2 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు సెమీ-ఫైనల్ జట్లు ఇప్పుడు నిర్ధారించబడ్డాయి. ఫిబ్రవరి 6న జరిగే తొలి సెమీస్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫిబ్రవరి 8న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ బెనోనిలో జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..