U19 World Cup: వరుస విజయాలతో దూసుకెళ్తోన్న యువ భారత్.. నేపాల్‌తో నేడు కీలక మ్యాచ్..
U19 World Cup 2024: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న U19 ODI ప్రపంచ కప్‌లో సూపర్ 6 రౌండ్‌లో నేపాల్‌తో టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడనుంది. నేడు అంటే ఫిబ్రవరి 2న బ్లూమ్‌ఫోంటైన్‌లోని మంగాంగ్ ఓవల్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, దాదాపుగా టీమిండియా సెమీస్ చేరుకుంటుంది.

India U-19 vs Nepal U-19: దక్షిణాఫ్రికాలో జరిగే U19 ప్రపంచ కప్ 2024 (U19 World Cup 2024) సూపర్ 6 రౌండ్‌లో టీమిండియా తన రెండవ మ్యాచ్‌ని నేపాల్‌తో (India vs Nepal) ఆడనుంది. ఫిబ్రవరి 2న బ్లూమ్‌ఫోంటైన్‌లోని మంగాంగ్ ఓవల్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో న్యూజిలాండ్‌తో టీమిండియా (Team India) తన తొలి సూపర్ 6 మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 214 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్‌పై విజయం సాధించడం ద్వారా వరుస విజయాలను కొనసాగించేందుకు టీమ్ ఇండియా ప్రయత్నిస్తుంది. అంతకు ముందు ఈ మ్యాచ్ పిచ్ ఎలా ఉంటుంది? ఈ మ్యాచ్‌ని టీవీ, మొబైల్‌లో ఎక్కడ చూడాలి? లాంటి వివరాలు ఓసారి చూద్దాం..
ఇదిగో పిచ్ రిపోర్ట్..
బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్ పిచ్ ప్రారంభ ఓవర్లలో తడిగా ఉంది. అలాగే ఒక్కసారి ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌లు చెలరేగితే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకు కొంత సహాయపడుతుంది. తద్వారా నేపాల్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత్, నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఫిబ్రవరి 2న భారత్, నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ జరగనుంది.
భారత్, నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది?
మఫొంటెయిన్‌లోని మంగాంగ్ ఓవల్‌లో భారత్, నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతోంది.
భారత్, నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారత్ – నేపాల్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు IST ప్రారంభం కానుంది.
ఇండియా vs నేపాల్ సూపర్ సిక్స్ మ్యాచ్‌ని టీవీలో ఎక్కడ చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్, నేపాల్ మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌ను టీవీలో వీక్షించవచ్చు.
ఇండియా vs నేపాల్ సూపర్ సిక్స్ మ్యాచ్‌ని మొబైల్‌లో ఉచితంగా చూడటం ఎలా?
భారత్, నేపాల్ మధ్య జరిగే సూపర్ సిక్స్ మ్యాచ్‌ను మొబైల్‌లోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.
రెండు జట్లు..
ప్రపంచకప్‌నకు భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, అరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, సౌమ్య పాండే, రాజ్ లింబానీ, నమన్ తివారీ, ఆరాధ్య షుక్లా , రుద్ర పటేల్, ప్రేమ్ డియోకర్, మొహమ్మద్ అమన్, అన్ష్ గోసాయి.
నేపాల్ జట్టు: దేవ్ ఖనాల్ (కెప్టెన్), అర్జున్ కుమల్, బిపిన్ రావల్ (వికెట్ కీపర్), ఆకాష్ త్రిపాఠి, గుల్సన్ ఝా, దీపక్ దుమ్రే, దీపక్ బోహ్రా, దీపేష్ కండెల్, సుభాష్ భండారీ, తిలక్ భండారీ, ఆకాశ్ చంద్, ఉత్తమ్ థాపా మగర్, దుర్గేష్ గుప్తా, హేమంత్ ధామి, బిషాల్ బిక్రమ్ కేసీ, దీపక్ బోహ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




