IPL Records: ఆల్ టైమ్ ఐపీఎల్ బెస్ట్ ప్లేయర్స్ వీరే.. లిస్టులో 11 మంది.. కోహ్లీకి మాత్రం మొండిచేయి..
ఐపీఎల్ 2023కి రంగం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అంతకంటే ముందు IPL చరిత్రలో పరుగుల సత్తా చాటిన 11 మంది ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం.
ఐపీఎల్ 2023కి రంగం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అంతకంటే ముందు IPL చరిత్రలో పరుగుల సత్తా చాటిన 11 మంది ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం. ఇందులో ఒకటో నంబర్ నుంచి 11వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసిన ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్లు అన్నమాట. అయితే, వీరిలో ఐదు స్థానాల్లో బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లదే పైచేయిగా నిలిచింది. కాగా, వీరిలో కొందరు ప్రస్తుతం IPL ఆటడం లేదు. కానీ ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం గమనార్హం.
ఓపెనింగ్‌లో అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్లు, అంటే నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 3864 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అదే సమయంలో 4852 పరుగులు చేసిన శిఖర్ ధావన్ రెండవ నంబర్ బ్యాట్స్‌మెన్.
ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు. ఐపీఎల్ 2023లో రైనా ఆడడం లేదు. అతను 3వ స్థానంలో ఆడుతూ 4934 పరుగులు చేశాడు.
4, 5 బ్యాటింగ్ స్థానాల్లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఉన్నారు. ఇద్దరూ వరుసగా 2392, 1949 పరుగులు చేశారు. ఇది ఈ రెండు ఆర్డర్‌లలో ఏ IPL బ్యాట్స్‌మెన్‌పై అయినా అత్యధిక పరుగులు కావడం విశేషం.
లోయర్ ఆర్డర్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు 6, 7 బ్యాటింగ్ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఐపీఎల్ 2023లో ఆటగాడిగా కాకుండా బ్యాటింగ్ కోచ్‌గా కనిపించనున్న కీరన్ పొలార్డ్ ఆరో స్థానంలో 1372 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ 718 పరుగులతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
8, 9, 10, 11 స్థానాలు భారత ఆటగాళ్లకే దక్కాయి. హర్భజన్ సింగ్ (406 పరుగులు), భువనేశ్వర్ కుమార్ (167 పరుగులు), ప్రవీణ్ కుమార్ (86 పరుగులు), మునాఫ్ పటేల్ (30 పరుగులు) ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రమంలో ఈ క్రమంలో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..