Cricket: 17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

పొట్టి క్రికెట్‌లో బ్యాటర్ల విధ్వంసం సర్వసాధారణం. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు కేవలం వీక్షకులు మాత్రమే. బ్యాట్స్‌మెన్లు తక్కువ...

Cricket: 17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!
Cricketer
Follow us

|

Updated on: Dec 03, 2021 | 10:04 PM

పొట్టి క్రికెట్‌లో బ్యాటర్ల విధ్వంసం సర్వసాధారణం. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు కేవలం వీక్షకులు మాత్రమే. బ్యాట్స్‌మెన్లు తక్కువ వ్యవధిలోనే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడేస్తారు. సరిగ్గా ఇక్కడ ఓ బ్యాట్స్‌మెన్ అదే సీన్ రిపీట్ చేశాడు. ప్రత్యర్ధి బౌలర్లు ఎన్ని ప్రణాళికలు రచించినా.. అతడి తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఆపలేకపోయారు. ఇక ఆ బ్యాటర్ ఎవరో కాదు టామ్ కోహ్లర్ కాడ్‌మోర్.

ఈ మ్యాచ్ టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్, బంగ్లా టైగర్స్ జట్ల మధ్య జరిగింది. డెక్కన్ గ్లాడియేటర్స్‌ తరపున బరిలోకి దిగిన కాడ్మోర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటింగ్ ఆరంభించిన కాడ్మోర్ జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు.

కాడ్మోర్ 17 బంతుల్లో 78 పరుగులు చేశాడు!

డెక్కన్ గ్లాడియేటర్స్ తరపున బరిలోకి దిగిన టామ్ కాడ్మోర్ 246.15 స్ట్రైక్‌రేట్‌తో 39 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 12 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అంటే బౌండరీల రూపంలోనే 78 పరుగులు రాబట్టాడు. కాడ్మోర్‌ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 140 పరుగులుచేసింది. తద్వారా బంగ్లా టైగర్స్ ముందు 141 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డెక్కన్ గ్లాడియేటర్స్ విధించిన టార్గెట్‌ను చేధించే క్రమంలో బంగ్లా టైగర్స్ 10 ఓవర్లకు 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!