Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..
2026లో విరాట్ కోహ్లీ తలుచుకుంటే మూడు అరుదైన రికార్డులను చేధించగలడు. ఒకటి ఐపీఎల్‌లో కాగా.. మిగిలిన రెండూ అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించగలిగే రేర్ రికార్డులు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. లేట్ ఎందుకు మీరూ చూసేయండి మరి.

2025వ సంవత్సరం విరాట్ కోహ్లీకి అద్భుతమైన సీజన్ అని చెప్పొచ్చు. 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ, ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఆస్ట్రేలియాతో చివరి వన్డేతో కంబ్యాక్.. ఇలా కోహ్లీ ప్రతీ దానిలోనూ అద్భుతంగా రాణించాడు. ఇక 2026లో కూడా విరాట్ కోహ్లీ మూడు కీలక మైలురాళ్లు చేధించే అవకాశం ఉంది. మొదటిది.. ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. అందుకే కేవలం 339 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ప్రస్తుతం కోహ్లీ 259 ఇన్నింగ్స్‌లలో 8661 పరుగులు చేశాడు. అలాగే గత మూడు ఐపీఎల్ సీజన్లలోనూ 600 పరుగుల కంటే ఎక్కువే చేశాడు కోహ్లీ.
రెండోది.. వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించవచ్చు. సచిన్ 452 ఇన్నింగ్స్‌లలో 18426 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 296 ఇన్నింగ్స్‌లలో 14557 పరుగులతో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 15 వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే మరో 443 పరుగులు అవసరం. మూడోది.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకునే ఛాన్స్. 2026లోనే కోహ్లీ దీనిని సాధించవచ్చు. ప్రస్తుతం అతడు 623 ఇన్నింగ్స్‌లలో 27975 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే ముందు కుమార సంగక్కర 28016 పరుగులతో ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించడానికి కోహ్లీకి కేవలం 42 పరుగులు మాత్రమే అవసరం. న్యూజిలాండ్‌తో జరిగే 2026 తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.
View this post on Instagram




