IPL 2023: టీమిండియా వద్దంది.. ఐపీఎల్ ముద్దంది.. ఈ అన్‌లక్కీ ప్లేయర్స్ ఎవరో చూసేయ్యండి..
ఐపీఎల్ 16వ సీజన్‌లో అటు కుర్రాళ్లు, ఇటు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తమ జట్ల విజయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో అటు కుర్రాళ్లు, ఇటు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తమ జట్ల విజయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిట్‌నెస్, వయసు, ఫామ్‌లేమితో సతమతమవుతూ.. భారత్ జట్టుకు దూరమైన కొందరు టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్స్ తిరిగి ఐపీఎల్‌లో పునరాగమనం చేయడం.. ఆయా ఫ్రాంచైజీలకు కలిసివచ్చింది. ఈ జాబితాలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహనే ముందు వరుసలో ఉన్నాడు. సాధారణంగా టెస్టుల్లో తప్పితే.. వన్డేలు, టీ20ల్లో చోటు కోల్పోయిన రహనే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో దుమ్ము దులుపుతున్నాడు. అలాగే ఈ లిస్టులో ఏయే భారత ఆటగాళ్లు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
-
అజింక్య రహనే:
ఈ సీజన్‌లో చెన్నై బ్యాటర్ అజింక్య రహనే అదరగొడుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 71 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రహనే ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో 171 స్ట్రైక్‌రేట్‌తో 266 పరుగులు చేశాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు.
-
అమిత్ మిశ్రా:
ఈ 40 ఏళ్ల టీమిండియా వెటరన్ స్పిన్నర్..ప్రస్తుత సీజన్‌లో 7.27 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. లక్నో జెయింట్స్ తరపున ఆడుతోన్న అమిత్ మిశ్రా.. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 172 వికెట్లు తీశాడు.
-
ఇషాంత్ శర్మ:
ఈ టీమిండియా సీనియర్ బౌలర్ వన్డే జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 12 పరుగులను డిఫెండ్ చేసి.. తన జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే ఇషాంత్ ఇప్పటివరకు 6 వికెట్లు పడగొట్టాడు.
-
పీయూష్ చావ్లా:
ముంబై ఇండియన్స్ తరపున ఆడుతోన్న ఈ వెటరన్ ప్లేయర్ ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లతో పర్పుల్ క్యాప్రేసులో ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో ఇప్పటివరకు పీయూష్ చావ్లా 174 వికెట్లు పడగొట్టాడు.
-
మోహిత్ శర్మ:
భారత జట్టులో చివరిసారిగా 2015లో కనిపించిన మోహిత్ శర్మ.. ఈ సీజన్‌లో గుజరాత్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో 6.96 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు.
-
సందీప్ శర్మ:
ఈ ఐపీఎల్‌లో సందీప్ శర్మను రాజస్థాన్ రాయల్స్ బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకుంటూ.. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేసి.. తన జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. ప్రస్తుత సీజన్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.