SRH: కోట్లు ఖర్చయినా.. ఆ ఇద్దరిపై కావ్య మారన్ వేటు ఖాయం.. ఈసారి రిటైన్ కష్టమే!

|

Jun 01, 2024 | 1:47 PM

టోర్నీ కోసం కోట్లు ఖర్చు చేసే ఫ్రాంచైజీలు.. తాము కొనుగోలు చేసిన ప్లేయర్లు కచ్చితంగా అద్భుత ఆటతీరు కనబరచాలని కోరుకుంటారు. ఈ తరుణంలోనే మెగా వేలానికి వెళ్లకుండా.. తమతోనే మూడేళ్ల పాటు రిటెన్షన్ చేసుకుంటారు. సరే.! ఇదంతా పక్కనపెడితే.. ఐపీఎల్ 2024 ముగిసింది. ఆ వివరాలు ఇలా..

SRH: కోట్లు ఖర్చయినా.. ఆ ఇద్దరిపై కావ్య మారన్ వేటు ఖాయం.. ఈసారి రిటైన్ కష్టమే!
Srh
Follow us on

టోర్నీ కోసం కోట్లు ఖర్చు చేసే ఫ్రాంచైజీలు.. తాము కొనుగోలు చేసిన ప్లేయర్లు కచ్చితంగా అద్భుత ఆటతీరు కనబరచాలని కోరుకుంటారు. ఈ తరుణంలోనే మెగా వేలానికి వెళ్లకుండా.. తమతోనే మూడేళ్ల పాటు రిటెన్షన్ చేసుకుంటారు. సరే.! ఇదంతా పక్కనపెడితే.. ఐపీఎల్ 2024 ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా అవతరించాయి. లీగ్ అంతటా దూకుడైన ఆటతో ఫ్యాన్స్‌ను కట్టిపడేసిన ప్యాట్ కమిన్స్ సేన.. ఫైనల్ స్టెప్‌లో తడపడింది. కప్పును చేజార్చుకుంది. ఇక లీగ్ ముగిసింది కాబట్టి.. అందరి చూపు.. ఐపీఎల్ 2025 మెగా వేలంపై పడింది.

ఐపీఎల్ 2022 మెగా వేలం మాదిరిగానే వచ్చే ఏడాదికి జరిగే వేలంలోనూ సేమ్ రూల్స్ వర్తించే అవకాశం ఉంది బీసీసీఐ. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు.. మరో ఆటగాడిని రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తీసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు బోర్డు కల్పించనుంది. ఈ తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓ కావ్య మారన్.. కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను రిటైన్ చేసుకున్నారు. వీరి ముగ్గురిలో కేన్ మామ ఎలాగో జట్టులో లేడు. ఇక ఉన్న మిగతా ఇద్దరినీ.. అంటే అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను ఈసారి రిటైన్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

అబ్దుల్ సమద్.. ఫినిషర్‌గా ఈ సీజన్‌లో పేలవ ఆటతీరు కనబరిచాడు. అంతేకాదు కీలక మ్యాచ్‌లైన క్వాలిఫైయర్-2, ఫైనల్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ విషయానికొస్తే.. ఈసారి ఎక్కువగా అవకాశాలు దక్కకపోగా.. బెంచ్‌కే పరిమితమయ్యాడు. వీరిద్దరి కన్నా.. ఈ ఏడాది మంచిగా పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చిన అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలను రిటైన్ చేసుకోవాలని SRH యాజమాన్యం భావిస్తోందట.

ఇది చదవండి: SRH‌కి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..