Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ చరిత్రలో అత్యంత ‘ప్రమాదకరమైన’ మ్యాచ్.. 56 నిమిషాల్లో 6 సార్లు ఫిజియో ఎంట్రీ.. 61 బంతుల్లోనే ముగిసిన టెస్ట్..

ENG vs WI: జనవరి 1998లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. జనవరి 29న ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ 61 బంతుల్లోనే డ్రాగా ప్రకటించారు.

క్రికెట్ చరిత్రలో అత్యంత 'ప్రమాదకరమైన' మ్యాచ్.. 56 నిమిషాల్లో 6 సార్లు ఫిజియో ఎంట్రీ.. 61 బంతుల్లోనే ముగిసిన టెస్ట్..
Test Cricket
Follow us
Venkata Chari

|

Updated on: Jan 29, 2023 | 12:40 PM

On This Day: సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున క్రికెట్ చరిత్రలో అత్యంత పొట్టి టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 56 నిమిషాలు మాత్రమే సాగింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న పిచ్ కారణంగా ఆటగాళ్లు పదే పదే గాయపడటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జమైకాలోని కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 1998 జనవరి 29న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు వెస్టిండీస్‌లో కోర్ట్నీ వాల్స్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ బ్రియాన్ లారా తొలుత వీరిద్దరికి బౌలింగ్ కమాండ్ అప్పగించాడు.

పిచ్‌లో పగుళ్లతో విండీస్ బౌలర్ల దూకుడు..

వాల్స్, ఆంబ్రోస్ తమ ఫాస్ట్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టారు. ఈ బౌలర్లు పిచ్ నుంచి చాలా సహాయం పొందుతున్నారు. పిచ్‌లో పగుళ్లు ఉన్నాయి. దానిపై బంతి పడుతోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మొత్తం శరీరాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఫిజియోను మళ్లీ మళ్లీ రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన మొదటి 56 నిమిషాల్లో, ఇంగ్లండ్ ఫిజియో తన ఆటగాళ్ల గాయాన్ని సరిచేయడానికి 6 సార్లు మైదానంలోకి రావాల్సి వచ్చింది.

61 బంతుల్లో డ్రాగా ముగిసిన టెస్ట్..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు మొదటి 44 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగారు. మూడు వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాతి 17 బంతుల్లో పడ్డాక మ్యాచ్‌ను డ్రాగా అంపైర్లు ప్రకటించారు. నిజానికి మ్యాచ్ 11వ ఓవర్ తొలి బంతి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్ అంపైర్ల వద్దకు వెళ్లి పిచ్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో మ్యాచ్‌ను డ్రా చేయాలని అంపైర్లు నిర్ణయించారు. మ్యాచ్ డ్రా అయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు 10.1 ఓవర్లలో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..