AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు

IND vs SA: భారత్ సౌతాఫ్రికా మధ్య మూడోరోజు ఆట ముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోఒక వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్

IND vs SA: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు
Game Ended
uppula Raju
|

Updated on: Dec 28, 2021 | 9:58 PM

Share

IND vs SA: భారత్ సౌతాఫ్రికా మధ్య మూడోరోజు ఆట ముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోఒక వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులతో కలిసి భారత్ ఆధిక్యం 146 పరుగులుగా ఉంది. అంతకుముందు 276 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్ 327 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఎవ్వరు కనీసం రెండెకల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్‌ 327 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఎక్కడా ఎవ్వరిని క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు సాధిస్తూ కోలుకోలేని దెబ్బ తీశారు. సౌతాఫ్రికా 2 పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయింది. రెండో సెషన్ ప్రారంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. ఇలా వరుసగా వికెట్లు పోతూనే ఉన్నాయి. భారత బౌలర్ల ముందు ఎవ్వరు నిలవలేకపోయారు. టెంబా బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి కనీసం 150 పరుగులు దాటేలా చేశాడు. క్వింటన్‌ డికాక్ 34 పరుగులు పర్వాలేదనిపించాడు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 5, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.

Doctors protesting: ముదిరిన పీజీ నీట్‌ కౌన్సిలింగ్‌.. పోలీసుల ప్రవర్తనపై రెసిడెంట్‌ డాక్టర్ల ఆగ్రహం

Vijay Devarakonda’s Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..

Vangaveeti Radha: ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు.. గన్‌మెన్‌ను వెనక్కు పంపిన వంగవీటి రాధా..