Watch Video: థ్యాంక్స్ బ్రో.. నన్ను రక్షించావ్.. లేదంటే, టీమిండియా ఫ్యాన్స్ చేతిలో బలయ్యేవాడిని..

IND vs PAK: దినేష్ కార్తీక్ అవుట్ అయిన తర్వాత, పాకిస్తాన్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. అయితే అశ్విన్ భారత్‌కు విజయాన్ని అందించాడు.

Watch Video: థ్యాంక్స్ బ్రో.. నన్ను రక్షించావ్.. లేదంటే, టీమిండియా ఫ్యాన్స్ చేతిలో బలయ్యేవాడిని..
Ashwin Dinesh Karthik
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2022 | 3:37 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం పాకిస్థాన్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌ అశ్విన్‌ చివరి బంతికి పరుగు తీసి మ్యాచ్‌ని టీమిండియా ఖాతాలో వేశాడు. మ్యాచ్ ముగిసిన రెండు రోజుల తర్వాత, టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఆర్. అశ్విన్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

దినేష్ కార్తీక్ బౌలర్ అశ్విన్‌కి థ్యాంక్స్ చెప్పడానికి చాలా స్పెషల్ కారణం ఉంది. నిజానికి భారత్ విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు కావాలి. కానీ, 20వ ఓవర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్ ఔటయ్యాడు. కార్తీక్ ఔట్ అయిన వెంటనే పాకిస్థాన్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. అయితే ఆఖరి బంతికి బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ మ్యాచ్‌ను టీమిండియా బ్యాగ్‌లో పడేశాడు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి ఉంటే దినేష్ కార్తీక్ విమర్శలకు గురయ్యే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్నందున దినేష్ కార్తీక్ కూడా ట్రోల్స్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని ఆర్. అశ్విన్‌కి దినేష్ కార్తీక్ తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను పంచుకుంది. భారత జట్టు ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నట్లు ఆ వీడియోలో చూడొచ్చు. ఇదే వీడియోలో దినేష్ కార్తీక్ అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పినట్లు వినొచ్చు.

గతేడాది ట్రోల్ బారిన షమీ..

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ తర్వాత ఓడిపోయిన జట్టు ఆటగాళ్లు ట్రోలింగ్‌కు గురికావడం సర్వసాధారణమే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ భారత్‌ను ఓడించినప్పుడు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ట్రోల్స్‌కు గురయ్యాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన బౌలర్‌ను సమర్థించుకున్నాడు.

T20 ప్రపంచ కప్ గురించి మాట్లాడితే, వికెట్ కీపర్‌ కం బ్యాటర్‌గా దినేష్ కార్తీక్ టీమిండియాకు మొదటి ఎంపికగా నిలిచాడు. టీం ఇండియాలో దినేష్ కార్తీక్‌కు ఫినిషర్ పాత్రను అప్పగించారు. ఈ ప్రపంచకప్ తర్వాత దినేష్ కార్తీక్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చని తెలుస్తోంది.