IND vs NEP: పసికూన ముందు ఓడిన టీమిండియా బౌలర్లు.. రోహిత్ సేన టార్గెట్ 231

India vs Nepal, 5th Match, Group A: ఆసియా కప్-2023 5వ లీగ్ మ్యాచ్‌లో భారత్, నేపాల్ మధ్య పోరు కొనసాగుతోంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 231 పరుగుల టార్గెట్ నిలిచింది.

IND vs NEP: పసికూన ముందు ఓడిన టీమిండియా బౌలర్లు.. రోహిత్ సేన టార్గెట్ 231
Ind Vs Nep Score

Updated on: Sep 04, 2023 | 7:59 PM

India vs Nepal: ఆసియా కప్ మ్యాచ్‌లో భారత బౌలర్ల లోపాలను నేపాల్ బట్టబయలు చేసింది. షమీ, సిరాజ్, శార్దూల్, పాండ్యా, జడేజా, కుల్దీప్ వంటి వెటరన్ల ముందు నేపాల్ బ్యాటర్లు దాదాపు 50 ఓవర్లుడ ఆడడంతో అంతా అయోమయంలో ఉన్నారు. ఓ దశలో వికెట్లు పడగొట్టడంలో భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా 48.2 ఓవర్లు ఆడిన నేపాల్ టీం 230 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌పై ఇదే నేపాల్ టీం కేవలం 104 పరుగులకు ఆలౌట్ అయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నేపాల్ తరపున అసిఫ్ షేక్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా ముందు 231 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. నంబర్-8 బ్యాట్స్‌మెన్ సోంపాల్ కమీ 48 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరపున మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో 3 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా టార్గెట్ 231..

ఆసిఫ్ షేక్ 88 బంతుల్లో ఫిఫ్టీ

నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ తన వన్డే కెరీర్‌లో పదో ఫిఫ్టీని నమోదు చేశాడు. అతను 97 బంతుల్లో 59.79 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. రెండో ఓవర్‌లో ఆసిఫ్‌కు లైఫ్ రావడంతో.. అక్కడ నుంచి అతను తన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 88 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

ఓపెనర్లు 65 పరుగుల భాగస్వామ్యాం..

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు తొలి 6 ఓవర్లలో 3 లైఫ్‌లను దక్కించుకుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జట్టు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ 9వ ఓవర్లో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 10వ ఓవర్లో 38 పరుగులు చేసిన తర్వాత భుర్టెల్ ఔట్ అవ్వడంతో ఈ ఓపెనింగ్ భాగస్వామ్యానికి అడ్డుకట్ట పడింది. ఇద్దరూ 59 బంతుల్లో 65 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికి నేపాల్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి.

బుమ్రా స్థానంలో షమీకి అవకాశం..

టీమ్ ఇండియాలో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీకి అవకాశం లభించింది. బుమ్రాకు కుమారుడు జన్మించడంతో హుటాహుటిన ఆదివారం ముంబైకి తిరిగి వచ్చాడు. నేపాల్ జట్టులో ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షార్కీకి అవకాశం కల్పించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..