Asia Cup 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్..

KL Rahul: వన్డేల్లో భారత్‌ తరపున కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆసియా కప్‌లో ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ జట్టుకు కీలక బ్యాట్స్‌మెన్. అలాగే వికెట్ కీపర్ పాత్రను పోషించాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఎన్‌సీఏలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ.. తన పాత ఫాంను తిరిగి తెచ్చుకునేందుకు కష్టపడుతున్నాడు.

Asia Cup 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్..
Kl Rahul Asia Cup 2023
Follow us
Venkata Chari

|

Updated on: Aug 27, 2023 | 1:15 PM

KL Rahul: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో ప్రాక్టీస్ క్యాంపులో కసరత్తులు చేస్తోంది. ఈ శిబిరంలో ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌నకు సిద్ధమవుతోంది. ఈ శిబిరంలో అందరి చూపు కేఎల్ రాహుల్ పైనే ఉంది. చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో గాయపడ్డాడు. ఇప్పుడు రాహుల్ గాయం నుంచి తిరిగి వచ్చి ఆసియాకప్‌నకు సిద్ధమవుతున్నాడు. క్యాంప్‌లో మూడో రోజు రాహుల్ గురించి ఓ శుభవార్త వినిపిస్తోంది. క్యాంపులో శనివారం బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు.

వన్డేల్లో భారత్‌కు రాహుల్ వికెట్ కీపర్ పాత్ర పోషిస్తున్నాడు. ఆసియా కప్‌లో, ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ జట్టుకు ముఖ్యమైన బ్యాట్స్‌మెన్, అలాగే వికెట్ కీపర్ పాత్రను పోషించాల్సి ఉంటుంది. అప్పుడే జట్టు బ్యాలెన్స్ బాగుంటుంది. ఈ సమయంలో రిషబ్ పంత్ గాయం కారణంగా చాలా కాలం పాటు దూరంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

భీకరంగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్..

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

శిబిరంలో శనివారం రాహుల్ ధీటుగా బ్యాటింగ్ చేశాడు. అతను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించాడు. ఇద్దరూ ఒక గంట పాటు బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత, అతను వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. వికెట్ కీపింగ్‌లో మాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రాక్టీస్ చేశాడు. రాహుల్ ఆసియా కప్‌లో జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే టీమ్‌ను ప్రకటించినప్పుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, NCAలో చిన్న గాయంతో రాహుల్ పూర్తి ఫిట్‌గా లేడంటూ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 2-3 నాటికి అతను ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని అగార్కర్ ప్రకటించాడు. అంటే పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఫుల్ జోష్‌లో రోహిత్-విరాట్..

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌కు అతిపెద్ద ముప్పు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది. షాహీన్‌ను ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా పూర్తి సన్నాహాలు చేస్తోంది. అందుకే శిబిరంలో కొంతమంది లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను చేర్చారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అనికేత్ చౌదరిపై రోహిత్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అదే సమయంలో స్పిన్నర్లపై విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లపై విరాట్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. రాహుల్, రోహిత్‌ల జోడీ ఆరంభం చేయగా.. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే