AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: ఇదేందయ్యా ఇది.. ఛేజింగ్ అంటే ఇంతలా రెచ్చిపోతున్నావ్.. టాప్ 5లో ఈ దూకుడేంది భయ్యా..

Asia Cup Records: ఆసియా కప్‌లో విషయానికి వస్తే ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఛేజింగ్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 534 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 529 పరుగులు చేశాడు.

Asia Cup: ఇదేందయ్యా ఇది.. ఛేజింగ్ అంటే ఇంతలా రెచ్చిపోతున్నావ్.. టాప్ 5లో ఈ దూకుడేంది భయ్యా..
Team India
Venkata Chari
|

Updated on: Aug 27, 2023 | 12:59 PM

Share

Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టైటిల్ పోటీదారుగా బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో విజయవంతంగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హిట్‌మ్యాన్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో, భారత్ తన మొదటి మ్యాచ్‌ని సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ దృష్టిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలలో అతని రికార్డు అద్భుతంగా నిలిచింది.

ఆసియా కప్‌లో పరుగుల ఛేజింగ్‌లో రోహిత్ శర్మ టాప్..

ఆసియా కప్‌లో విషయానికి వస్తే ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గురించి తప్పక మాట్లాడుకోవాలి. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఛేజింగ్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 534 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 529 పరుగులు చేశాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 452 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. 391 పరుగులతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ 380 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 7 బ్యాట్స్‌మెన్స్ వీరే..

534 పరుగులు – రోహిత్ శర్మ

529 పరుగులు – విరాట్ కోహ్లీ

452 పరుగులు – సచిన్ టెండూల్కర్

391 పరుగులు – నవజోత్ సిద్ధూ

380 పరుగులు – శిఖర్ ధావన్

347 పరుగులు – ఏ రణతుంగ

332 పరుగులు – గౌతం గంభీర్

పాకిస్థాన్‌తో వన్డేల్లో రోహిత్ శర్మ ప్రదర్శన..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో జరిగిన వన్డే క్రికెట్‌లో సత్తా చాటాడు. వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్ జట్టుపై అతని బ్యాట్ పరుగుల వర్షం కురిపించింది. రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై 16 ఇన్నింగ్స్‌లలో 51.42 సగటుతో 2 సెంచరీలు , 6 అర్ధ సెంచరీలతో 720 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 88.77లుగా నిలిచింది. పాక్ జట్టుపై వన్డేల్లో హిట్‌మ్యాన్ అత్యుత్తమ స్కోరు 140 నాటౌట్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..