AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. నేడు తేలనున్న ఆ ముగ్గురి భవితవ్యం?

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటుండగా, అందులో 6 జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ జట్లను మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ 18న టీమిండియా స్వ్కాడ్‌ను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై అందరి ఆసక్తి నెలకొంది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. నేడు తేలనున్న ఆ ముగ్గురి భవితవ్యం?
Team India
Venkata Chari
|

Updated on: Jan 18, 2025 | 7:20 AM

Share

Champions Trophy: టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ కఠినమైన నియమాలు సృష్టించిన ప్రకంపనలతో ప్రస్తుతం హాట్ హాట్‌గా నడుస్తోంది. దీనికి సంబంధించి, నిపుణులు, మీడియా నుంచి సోషల్ మీడియా వరకు అభిమానులు ఈ విషయాలపై చర్చిస్తున్నారు. వీటన్నింటి మధ్య, ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఈ టోర్నీకి 6 జట్లు తమ జట్లను ఇప్పటికే ప్రకటించగా, భారత్, పాకిస్థాన్‌లు ఇంకా ప్రకటించలేదు. జనవరి 18వ తేదీ శనివారం జరిగే సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ సమావేశంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయనున్నారు.

ముంబైలో సెలక్షన్ కమిటీ సమావేశం..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్‌లలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఏ ఆటగాళ్లకు దుబాయ్‌కి టిక్కెట్‌ వస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్ల పేలవమైన ఫామ్, దేశవాళీ క్రికెట్‌లో పెను తుపాను సృష్టిస్తున్న కరుణ్ నాయర్ లాంటి బ్యాట్స్‌మెన్ పేరు బలంగా వినిపిస్తోంది. మరి ఈసారి సెలక్షన్ సమావేశం చాలా ప్రత్యేకంగా జరగనుందని తెలుస్తోంది.

నివేదికల ప్రకారం, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో శనివారం జట్టుపై చర్చిస్తుంది. అయితే శనివారం నాడు బోర్డు జట్టును ప్రకటిస్తుందా లేక సమయం పడుతుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అంతేకాదు సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయాలపై కూడా ఎంత శ్రద్ధ చూపుతారో చూడాలి. ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్, చీఫ్ సెలక్టర్, కెప్టెన్ మధ్య విభేదాల వార్తల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది.

సెలక్షన్ కమిటీ ముందు 3 ప్రశ్నలు..

ఛాంపియన్స్ ట్రోఫీకే కాకుండా ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా జట్టు ఎంపిక జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లలో ఏ ఆటగాళ్లకు చోటు దక్కుతుందన్నదే ప్రశ్న. ఇటీవలి ఫామ్‌లో ఉన్నప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం ఖాయం. అదే సమయంలో, టెస్ట్ ఫామ్ ఆధారంగా వన్డే నుంచి విరాట్ కోహ్లీని తొలగించే అవకాశం లేదు. అయితే, సెలక్షన్ కమిటీ ముందు 3 ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.

రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ గురించి, జట్టులో ఏ ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేస్తారు? ఇది కాకుండా, బోర్డు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కూడా అప్‌డేట్ పొందుతుందని భావిస్తున్నారు. ఇటీవలి నివేదికలలో, సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు ప్రస్తుతానికి విశ్రాంతి ఇచ్చారు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం లేదని తేలింది. ఇటువంటి పరిస్థితిలో, సెలక్షన్ కమిటీ అతనికి పూర్తి విశ్రాంతి ఇస్తుందా లేదా ఫిట్‌నెస్‌ని పేర్కొంటూ అతనిని జట్టులో ఉంచుతుందా అనేది చూడాలి.

విజయ్ హజారే ట్రోఫీలో 5 సెంచరీలు చేయడం ద్వారా 752 సగటుతో 752 పరుగులు చేసిన కరుణ్ నాయర్ గురించి కూడా మూడో పెద్ద ప్రశ్న. ఈ రోజుల్లో దేశవాళీ క్రికెట్ చుట్టూ ఉన్న కోలాహలం దృష్ట్యా, సెలెక్టర్లు అతని అద్భుతమైన ఆటతీరుకు రివార్డ్ ఇస్తారా లేదా అతను మళ్లీ నిర్లక్ష్యానికి గురికావలసి వస్తుందా? ఒకవేళ అతను ఎంపికైతే జట్టులో ఎవరు తప్పుకుంటారు? ఈ ప్రశ్నలకు శనివారం సమాధానాలు లభించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..