IND vs IRE T20 Squad: ఐర్లాండ్‌తో టీ20ఐ సిరీస్.. కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. భారత సారథిగా యార్కర్ల స్పెషలిస్ట్..
India Vs Ireland: ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుండగా, రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియాను ప్రకటించారు. ఈ 15 మంది సభ్యుల జట్టుకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు.
Jasprit Bumarh: ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియాను ప్రకటించారు. ఈ 15 మంది సభ్యుల జట్టుకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. అలాగే, సంజూ శాంసన్, జితేష్ శర్మలు జట్టులో వికెట్ కీపర్లుగా కనిపించారు. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్‌లు జట్టులో చోటు సంపాదించగలిగారు.
అలాగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా కీలక ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించారు. అందువల్ల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన చాలా మంది ఆటగాళ్లు ఐర్లాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యారు.
ఇద్దరు పేసర్ల పునరాగమనం..
ఈ సిరీస్ ద్వారా టీమిండియా ఇద్దరు పేసర్లు పునరాగమనం చేయడం విశేషం. అంటే గాయం కారణంగా గత ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా బ్లూ జెర్సీలో కనిపించనున్నారు.
భారత్-ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్..
ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుండగా, రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. 3వ మ్యాచ్ ఆగస్టు 22న జరగనుంది. డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లన్నింటికీ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐర్లాండ్ సిరీస్‌కి భారత టీ20 జట్టు..
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, పర్దీష్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.
వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి టీమిండియా..
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆసియా క్రీడలకు ఎంపికైన భారత జట్టు ..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
రిజర్వ్‌డ్ ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..