IND vs WI, 3rd ODI: 3వ వన్డేకు సిద్ధమైన ఇరుజట్లు.. ఆ ఇద్దరికీ లాస్ట్ ఛాన్స్.. రాణిస్తేనే జట్టులో..

India vs West Indies, 3rd ODI: నేడు (ఆగస్టు 1) భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకం కానుంది. అంటే 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, 2వ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమం కావడంతో మూడో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది.

IND vs WI, 3rd ODI: 3వ వన్డేకు సిద్ధమైన ఇరుజట్లు.. ఆ ఇద్దరికీ లాస్ట్ ఛాన్స్.. రాణిస్తేనే జట్టులో..
Ind Vs Wi 3rd Odi
Follow us
Venkata Chari

|

Updated on: Aug 01, 2023 | 6:40 AM

India vs West Indies: నేడు (ఆగస్టు 1) భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకం కానుంది. అంటే 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, 2వ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమం కావడంతో మూడో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఈ కీలక మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లకు కీలక మ్యాచ్ కానుంది.

ఎందుకంటే వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ 43 పరుగులు మాత్రమే చేశాడు. 2వ వన్డేలో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే వచ్చే సిరీస్‌లో టీమిండియాలో కనిపించే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే వచ్చే సిరీస్ ద్వారా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు టీమ్‌ఇండియాలో చేరవచ్చు. వీరిద్దరూ వన్డే క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లుగా పేరుగాంచారు.

ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో నాలుగో నంబర్‌లో మంచి బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లుగా సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. అయితే వీరిద్దరూ విఫలమవడం టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళనను పెంచింది.

కేఎల్ రాహుల్ జట్టులోకి పునరాగమనం చేస్తే 5వ స్థానంలో ఆడతాడని చెప్పొచ్చు. మరోవైపు మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. రాబోయే సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. వీరిద్దరి రాకతో మిడిలార్డర్‌లో ఉన్న సూర్య, శాంసన్‌లు అవకాశాలు కోల్పోవడం ఖాయమని తెలుస్తోంది.

తద్వారా వెస్టిండీస్ తో జరిగే 3వ వన్డే మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లకు చివరి అవకాశంగా విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆఖరి అవకాశంలో మెరిసి వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటారేమో వేచి చూడాలి.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, యుజువేంద్ర చాహల్, సంజూ శాంసన్, జయదేవ్ ఉనద్కత్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..