Champions Trophy 2025: ఆ ప్లేయర్లు మళ్లీ వస్తున్నారు.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే!

|

Jan 03, 2025 | 8:23 PM

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మినీ వరల్డక్ కప్ గా భావించే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడనున్న భారతీయ ఆటగాళ్లపై ప్లేస్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Champions Trophy 2025: ఆ ప్లేయర్లు మళ్లీ వస్తున్నారు.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే!
ICC Champions Trophy 2025
Follow us on

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ కి సమయం ముంచుకొస్తోంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండగా, మొత్తం ఎనిమిది జట్లు కప్ కోసం పోటీపడుతున్నాయి. భారత్ గ్రూప్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న హైవోల్టేజ్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టులో ఎవరెవరు ఉంటారన్న దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఖరారైంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ను అతని నేతృత్వంలోనే ఆడనున్నట్లు ప్రకటించారు. కానీ టెస్టుల్లో వెనకబడిన భారత్ ఇప్పుడు క్వాలిఫై అవుతుందా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎలా ఎంపిక చేస్తారనే దానిపై ఆరా తీస్తున్నారు.

రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండటం దాదాపు ఖాయం. అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగా వినిపిస్తోంది సాగుతోంది. అతనే శ్రేయాస్ అయ్యర్.. గత కొన్ని రోజులుగా ఈ ఆటగాడు టీమిండియాలో లేడు. భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీ తో మెరిశాడు. కాగ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో శ్రేయస్ ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై శ్రేయాస్ అయ్యర్ 133 బంతుల్లో 137 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. స్పోర్ట్‌స్టాక్ నివేదిక ప్రకారం, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి 12. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. గత 2017 ఎడిషన్‌లో ఫైనల్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది.

 

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..

టీమిండియా మ్యాచ్ ల వివరాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..