‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ ఆసక్తిగా ఉన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో..

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 10:10 AM

INDIA-VS-AUSTRALIA-2020: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు సాధన‌లో

‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ ఆసక్తిగా ఉన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో..
Follow us on

INDIA-VS-AUSTRALIA-2020: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు సాధన‌లో చెమటోడ్చారు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ విజయవంతంగా ముగించారు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో తుదిజట్టుపై ఆసక్తి పెరిగింది. నెట్స్‌లో సాధన చేస్తున్న గిల్‌కు కుల్‌దీప్ బౌలింగ్ చేశాడు. స్పిన్‌, వేగంతో దూసుకొచ్చిన బంతుల్ని ఎదుర్కోవడానికి గిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల వేసిన ఓ బంతి గింగరాలు తిరుగుతూ గిల్‌ ప్యాడ్‌కు తగలింది.

బ్యాట్స్‌మన్‌కు సమాధానం దొరకని ఆ బంతిని చూసి గిల్‌ ఆశ్చర్యంగా చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ అని కామెంట్ పెట్టారు. గాయంతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా సాధనలో పాల్గొనప్పటికీ బౌలింగ్ కోచ్‌ అరుణ్‌తో కలిసి పేసర్లకు మార్గనిర్దేశం చేశాడు. కోచ్‌తో కలిసి కంగారూలకు కళ్లెం వేయడానికి ప్రణాళికలు రచించడంలో సాయం చేస్తున్నాడు. అయితే బుమ్రా గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్‌లో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.