Virat Kohli: ఆసీస్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కోహ్లీ.. తొలి విదేశీ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్.. అదేంటంటే?

IND vs AUS Adelaide Test Match: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2024-25 రెండో మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో అతను తన పేరిట పెద్ద రికార్డు సృష్టించగలడు. విరాట్‌కు ఈ మైదానంలో పరుగులు చేయడం ఇష్టం. అడిలైడ్‌లో అతని గణాంకాలు చూస్తే చాలా షాకింగ్‌గా ఉన్నాయి.

Virat Kohli: ఆసీస్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కోహ్లీ.. తొలి విదేశీ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్.. అదేంటంటే?
ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ రెండో స్థానంలో ఉన్నారు. 1996 నుంచి 2012 మధ్య 248 ఇన్నింగ్స్‌లు ఆడిన లక్ష్మణ్ మొత్తం 135 క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు 117 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ మరో 18 క్యాచ్‌లు పట్టినట్లయితే లక్ష్మణ్ రికార్డును బద్దలు కొట్టగలడు.

Updated on: Nov 27, 2024 | 7:19 PM

IND vs AUS Adelaide Test Match: ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్ మైదానంలో రెండో మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 6న జరగనున్న ఈ మ్యాచ్ డే-నైట్‌గా జరగనుంది. అంటే, ఈ మ్యాచ్‌లో రెడ్ బాల్‌కు బదులు పింక్ బాల్‌ను ఉపయోగించనున్నారు. భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్‌లో, అడిలైడ్ గడ్డపై ఇప్పటి వరకు ఏ వికెట్ ప్లేయర్ చేయలేని రికార్డును అతను తన పేరిట ఓ భారీ రికార్డును సృష్టించే ఛాన్స్ ఉంది.

చరిత్ర సృష్టించేందుకు చాలా దగ్గరలో విరాట్ కోహ్లీ..

అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు విరాట్ కోహ్లి పెను సవాల్‌గా మారవచ్చు. అడిలైడ్‌లో విరాట్ బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ మైదానంలో కోహ్లీ రికార్డులు చాలా భయానకంగా ఉన్నాయి. అడిలైడ్ ఓవల్ మైదానంలో విరాట్ ఇప్పటివరకు 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 73.61 సగటుతో 957 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. అంటే, విరాట్‌కి అడిలైడ్‌లో ఆడడం అంటే చాలా ఇష్టం అని ఈ లెక్కల ద్వారా కూడా రుజువైంది.

ఈ డే-నైట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేస్తే, అడిలైడ్ ఓవల్ మైదానంలో అంతర్జాతీయంగా 1000 పరుగులు పూర్తి చేయనున్నాడు. విశేషమేమిటంటే, అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా విరాట్ నిలిచాడు. అంటే, ఈ ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ తప్ప మరే విదేశీ ఆటగాడు ఇన్ని పరుగులు చేయలేదు. ఈ మైదానంలో కోహ్లీ కాకుండా బ్రియాన్ లారా 940 పరుగులు చేశాడు. అయితే, టెస్ట్ ఫార్మాట్ గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 63.62 సగటుతో 509 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ..

పెర్త్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి బ్యాట్‌ నుంచి అద్భుత సెంచరీ కనిపించింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 5 పరుగులు చేశాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు చేశాడు. దీనికి ముందు, అతను 16 నెలల క్రితం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి టెస్టుల్లో సెంచరీ చేసేందుకు కష్టపడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..