IND vs ENG: ధోని, విరాట్‌ల సరసన శుభ్మన్ గిల్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా మారే ఛాన్స్.. కారణం ఏంటో తెలుసా?
England vs India, 1st Test: శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీం ఇండియా కొత్త చరిత్ర సృష్టించే ఉద్దేశ్యంతో ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది. 2007 నుంచి భారత జట్టు ఇంగ్లీష్ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. కానీ, ఈసారి భారత జట్టు కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగనుంది.

England vs India, 1st Test: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, శుభ్‌మన్ గిల్‌ను భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఈసారి గిల్ నాయకత్వంలో, భారత జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండా ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది. ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో లేకపోవడం కొత్త కెప్టెన్‌పై ఒత్తిడిని పెంచుతోంది. కానీ అతను దాని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. అతను యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం కలిగి ఉన్నాడు. దీంతో పాటు మరొక యాదృచ్చికం ఉంది. దాని కారణంగా గిల్ విజయవంతమైన కెప్టెన్‌గా మారగలడు. ఇది గతంలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ విషయంలో జరిగింది. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విషయంలో కూడా అదే యాదృచ్చికం జరగబోతోంది.
ఆ యాదృచ్చికం ఏమిటంటే?
2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన శుభగన్ గిల్ ఇప్పటివరకు టీం ఇండియా తరపున 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో 33వ మ్యాచ్‌లో అతను టీం ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అంతకుముందు, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత 33వ మ్యాచ్‌లో కూడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. నేడు వారిద్దరూ భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో చేరారు.
ఇప్పుడు ఈ యాదృచ్చికం శుభ్‌మన్ గిల్ విషయంలో కూడా జరిగింది. అటువంటి పరిస్థితిలో, అతను విజయవంతమైన కెప్టెన్‌గా కూడా మారగలడు. కానీ, ఇందుకోసం ఆటగాళ్లను బాగా రాణించేలా ప్రేరేపించాల్సి ఉంటుంది. దీంతో పాటు, అతను స్వయంగా బ్యాట్‌తో భారీగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. శుభ్‌మన్ గిల్ 32 టెస్ట్ మ్యాచ్‌ల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతంలో, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీం ఇండియా అద్భుతంగా రాణించింది.
కెప్టెన్‌గా ధోని, విరాట్ ప్రదర్శన ఎలా ఉంది?
భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత జట్టును నడిపించారు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని 60 టెస్ట్ మ్యాచ్‌లలో జట్టును నడిపించారు. అందులో జట్టు 27 గెలిచి 18 ఓడిపోయింది. 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
విరాట్ కోహ్లీ 68 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వాటిలో 40 మ్యాచ్‌లలో అతను గెలిచాడు. 17 మ్యాచ్‌లలో అతను ఓటమి పాలైతే, 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. శుభ్‌మాన్ గిల్ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియాను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




