AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yusuf Pathan: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యూసఫ్‌ పఠాన్‌.. సచిన్‌ను భుజాలపై మోయడం మరిచిపోలేనంటూ..

Team India Player Irfan Pathan Retirement:టీమిండియా ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ జీవితానికి గుడ్‌ బై చెప్పాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ సహా మిగతా అన్ని ఫార్మట్లకు వీడ్కోలు పలుకుతూ యూసఫ్‌ ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను...

Yusuf Pathan: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యూసఫ్‌ పఠాన్‌.. సచిన్‌ను భుజాలపై మోయడం మరిచిపోలేనంటూ..
Narender Vaitla
|

Updated on: Feb 26, 2021 | 7:17 PM

Share

Team India Player Irfan Pathan Retirement: టీమిండియా ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ జీవితానికి గుడ్‌ బై చెప్పాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ సహా మిగతా అన్ని ఫార్మట్లకు వీడ్కోలు పలుకుతూ యూసఫ్‌ ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను హగ్‌ చేసుకున్న ఫొటోతో పాటు సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌తో దిగిన ఫొటోను ట్వీట్‌ చేసిన యూసఫ్‌ తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ రిటైర్మైంట్‌కు సంబంధించి సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌తో పాటు.. ‘ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పా. ఇంతకాలం నా వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, స్పేహితులకు, అభిమానులకు, కోచ్‌లకు.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇక సచిన్‌తో ఉన్న తన సాన్నిహిత్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన యూసఫ్‌.. ‘రెండు ప్రపంచ కప్‌లను గెలుచుకోవడం, సచిన్‌ రిటైర్మైంట్‌ రోజున తనను నా భూజాలపై ఎత్తుకోవడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనలు’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడీ ఆల్‌రౌండర్‌.

పఠాన్‌ కెరీర్‌ విషయానికొస్తే..

యూసఫ్‌ పఠాన్‌ 2007లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 57 వన్డేల్లో 810 పరులు చేశాడు. ఇక 22 టీ20లు ఆడిన యూసఫ్‌ 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 5 అర్థ సెంచరీలు చేసిన యూసఫ్‌ పఠాన్‌ 2012 తర్వాత మళ్లీ టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే.. 2008లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున యూసఫ్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది రాజస్తాన్‌ టైటిల్‌ గెలుచుకోవడంతో తన వంతు పాత్రను పోషించాడు. ఇక ఆ తర్వాత సీజన్లలో యూసఫ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పుణే వారియర్స్‌, సన్‌రైజర్స్‌ హైదాబాద్‌ జట్లలో ఆడాడు. ఇక 2018లో చివరిసారి ఐపీఎల్‌లో పాల్గొన్న యూసఫ్‌ను ఆ తర్వాత ఫ్రాంచైజీలు తీసుకోవడానికి ముందుకురాలేవు. ఇదిలా ఉంటే మంగళవారం యూసఫ్‌ పఠాన్‌ హైదరాబాద్‌లో పఠాన్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Also Read: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

India vs England 2021: అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!