Asia Cup 2025: ఆసియా కప్ తొలి మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. కీపర్‌గా ఎవరంటే?
Team India Predicted Playing XI Asia Cup T20I: ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్ కోసం భారత జట్టులో ప్రాబబుల్ ప్లేయింగ్ XI జట్టును ఇర్ఫాన్ పఠాన్ విడుదల చేశారు. అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఓపెనర్లుగా, తిలక్ వర్మ 3వ స్థానంలో బరిలోకి దిగనునన్నట్లు తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు.

Team India Predicted Playing XI Asia Cup T20I: సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 ఆసియా కప్‌లో టీమిండియా సెప్టెంబర్ 10న యుఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. కానీ, ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ ఏ 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించుతాడో చూడడం ఆసక్తికరంగా ఉంది. ప్లేయింగ్ 11ను సిద్ధం చేయడం కెప్టెన్, ప్రధాన కోచ్‌లకు సవాలుతో కూడిన పని. కానీ, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, జట్టు మాజీ స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 2025 ఆసియా కప్ కోసం భారత జట్టులోని బలమైన ప్లేయింగ్ 11 మందిని పేర్కొన్నాడు.
బ్యాటింగ్ విభాగం..
పఠాన్ పంజాబ్ ద్వయం అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను 3వ స్థానంలో ఉంచారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్‌లో నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి అనుభవజ్ఞులైన ఆల్ రౌండర్లు జట్టులోకి వస్తాడని తెలిపాడు.
సంజు వికెట్ కీపింగ్ బాధ్యతలు..
వికెట్ కీపర్ పాత్రకు పఠాన్ ఎంపిక ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే, సెలెక్టర్లు జితేష్ శర్మను మొదటి ఎంపికగా పరిగణించగా, ఇర్ఫాన్, సంజు శాంసలన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యత అప్పగించారు. పఠాన్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లను మిగిలిన ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేయగా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు స్పిన్నర్ల జట్టులో స్థానం కల్పించారు.
ఇర్ఫాన్ పఠాన్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
భారత అధికారిక జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








