Team India: రోహిత్ సేన దెబ్బకు పాక్, ఆస్ట్రేలియా ప్లేస్‌లు గోవిందా.. కేవలం 2 అడుగుల దూరంలోనే..

Team India: టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక టీమిండియా వన్డే క్రికెట్‌లో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. దీని ద్వారా వన్డే ప్రపంచకప్‌నకు ముందు మూడు ఫార్మాట్లలో నంబర్ 1 టీమ్‌గా అవతరించేందుకు రోహిత్ సేనకు మంచి అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Team India: రోహిత్ సేన దెబ్బకు పాక్, ఆస్ట్రేలియా ప్లేస్‌లు గోవిందా.. కేవలం 2 అడుగుల దూరంలోనే..
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Sep 13, 2023 | 8:14 PM

Team India Players Virat Kohli, Rohit Sharma: ఆసియా కప్‌ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరువలో ఉంది. దీని కోసం భారత జట్టు తదుపరి 2 మ్యాచ్‌ల్లో భారీ ఆధిక్యంతో గెలవాల్సి ఉంటుంది. అంటే సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాలి. అలాగే, ఆసియా కప్ ఫైనల్‌లోనూ విజయం సాధించాలి. ఇదే జరిగితే వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఎందుకంటే ప్రస్తుతం వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా 3వ స్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. 118 రేటింగ్‌తో ఆసీస్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ రేటింగ్ 118లుగా నిలిచింది. మూడో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా 116 రేటింగ్స్ సాధించింది. అంటే తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లతో పోల్చితే టీమిండియాకు 2 పాయింట్ల తేడా ఉంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఇక్కడ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటే.. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ కంటే టీమిండియా పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఖాతాలో 3,061 పాయింట్లు ఉండగా, పాకిస్థాన్ ఖాతాలోనూ 3,061 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే టీమిండియాకు మొత్తం 4,516 పాయింట్లు ఉన్నాయి. అంటే, ఇక్కడ రేటింగ్ పెరిగితే టీమిండియా అగ్రస్థానంలో నిలవడం ఖాయం.

టీమిండియా నంబర్ 1..

బంగ్లాదేశ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే, ఇది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

పాకిస్థాన్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై ఓడిపోవాలి. అలాగే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో 2 వన్డేల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు జట్లను అధిగమించి టీమిండియా అగ్రస్థానానికి చేరుకోవచ్చు. లేకుంటే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకునేందుకు భారత్ ఆసియాకప్ ఫైనల్ వరకు ఆగక తప్పదు.

టీ20ల్లో టీమిండియాదే అగ్రస్థానం..

టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక టీమిండియా వన్డే క్రికెట్‌లో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. దీని ద్వారా వన్డే ప్రపంచకప్‌‌నకు ముందు మూడు ఫార్మాట్లలో నంబర్ 1 టీమ్‌గా అవతరించేందుకు టీమ్ ఇండియాకు మంచి అవకాశం ఉంది. ఇదే జరిగితే, వన్డే ప్రపంచ కప్ 2023లోకి నంబర్ వన్ జట్టుగా అడుగుపెట్టనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..