భారత జట్టుకు దొరికిన ఆణిముత్యం.. ప్రపంచ కప్ 2023లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హైదరాబాదీ పేసర్.. 2022లో లెక్కలే నిదర్శనం..

World Cup 2023: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భారత జట్టుకు గొప్ప బౌలర్ దొరికాడని అంతా భావిస్తున్నారు.

భారత జట్టుకు దొరికిన ఆణిముత్యం.. ప్రపంచ కప్ 2023లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హైదరాబాదీ పేసర్.. 2022లో లెక్కలే నిదర్శనం..
Team India
Follow us

|

Updated on: Dec 07, 2022 | 8:00 AM

World Cup 2023: టీ20 ప్రపంచ కప్‌లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ (World Cup 2023) కోసం ఎదురుచూస్తోంది. ప్రపంచకప్‌ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ రోజుల్లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓడినా బౌలింగ్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన లయతో కనిపించాడు. బౌలింగ్ చేస్తూ 10 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు సిరాజ్ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన రిథమ్‌తో కనిపిస్తున్నాడు.

వన్డేల్లో ఈ ఏడాది దుమ్ము లేపిన హైదరాబాదీ పేసర్..

టెస్టు జట్టులో భాగమైన మహ్మద్ సిరాజ్ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. సిరాజ్ 2022లో 13 వన్డేల్లో 13 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 22.09 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 4.33గా ఉంది.

సిరాజ్ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2022లో 13 మ్యాచ్‌లు ఆడాడు. 2019లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 7.60 ఎకానమీతో 76 పరుగులు వెచ్చించినా వికెట్‌ పడలేదు. సిరాజ్ 2022 ప్రదర్శనను చూస్తుంటే, 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టుకు బౌలర్ దొరికాడని అనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్ తరపున మూడు ఫార్మాట్స్‌లో సత్తా..

మహ్మద్ సిరాజ్ భారత్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఇందులో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ 40 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అతను 14 వన్డేలు ఆడుతూ 21 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20లో సిరాజ్ ఎకానమీ 9.18గా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..