
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ అద్భుత సెంచరీ సాధించాడు. 12 ఇన్నింగ్స్‌ల తర్వాత గిల్ బ్యాట్ నుంచి ఈ సెంచరీ రావడం గమనార్హం.
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ సెంచరీకి చేరువయ్యాడు గిల్ . కానీ 91 పరుగుల వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండోఆటగాడిగా నిలిచాడు శుభ్‌మన్ గిల్. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 252 పరుగులు చేశాడీ టీమిండియా ప్రిన్స్. ఇదిలా ఉంటే గిల్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం టీమిండియా ప్రిన్స్ కు కీలక బాధ్యతలు అప్పగించింది.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అతనిని పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా నియమించింది. ఇప్పుడు కొత్త బాధ్యతలు స్వీకరించిన శుభ్‌మన్ గిల్ ఎన్నికలకు ముందు ఓటర్లలో ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల ప్రధాన అధికారి సిబిన్ సి తెలిపారు. దీని ప్రకారం గిల్ విడిగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం 70 శాతం దాటేలా ఓటర్లకు అవగాహన కల్పించడమే ఈ నియామకం ప్రధాన ఉద్దేశం.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాలకు 65.96 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 70శాతం పోలింగ్ నమోదు చేయడమే మా లక్ష్యం అని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ‘ఈసారి 70 దాటాలి’ అనే నినాదంతో కమిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. గత శుక్రవారం పంజాబ్‌లోని డిప్యూటీ కమిషనర్లందరితో జరిగిన సమావేశంలో గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరారు. దీని ప్రకారం గుర్తించిన చోట్ల ఎన్నికలపై గిల్ అవగాహన కల్పిస్తారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ గిల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అందుకే పంజాబ్ స్టేట్ ఐకాన్ గా నియమించాం. ఓటింగ్ పట్ల యువతలో అవగాహన కల్పించడమే ఈ నియామకం ప్రధాన ఉద్దేశం.ప్రతి ఒక్కరినీ ఓటు వేయడానికి ప్రేరేపించి, ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దోహదపడుతుంది’ అని ఎన్నికల అధికారి తెలిపారు. అంతకుముందు, ప్రముఖ పంజాబీ గాయకుడు తార్సేమ్ జస్సర్ ‘రాష్ట్ర ఎన్నికల ఐకాన్’గా ఎంపికయ్యారు. ఇప్పుడు గిల్ ఆ బాధ్యతను స్వీకరించనున్నారు.
Shubman Gill has been designed as “Punjab State Icon” for Lok Sabha Polls. [PTI] pic.twitter.com/W9mQUeOJ4T
— Johns. (@CricCrazyJohns) February 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..