Rohit Sharma: హిట్‌మ్యాన్‌ అరంగేట్రానికి 15 ఏళ్లు పూర్తి.. వారి కారణంగానే ఇక్కడి దాకా వచ్చానంటూ ఎమోషనలైన టీమిండియా కెప్టెన్‌..

|

Jun 23, 2022 | 4:41 PM

India Cricket: సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా

Rohit Sharma: హిట్‌మ్యాన్‌ అరంగేట్రానికి 15 ఏళ్లు పూర్తి.. వారి కారణంగానే ఇక్కడి దాకా వచ్చానంటూ ఎమోషనలైన టీమిండియా కెప్టెన్‌..
Rohit Sharma
Follow us on

India Cricket: సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీతో రోహిత్ బరిలోకి దిగాడు. లెక్కలేనన్ని పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్‌లో మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇలా 15 ఏళ్ల కెరీర్‌లో అతను సాధించిన రికార్డులకు కొదవేలేదు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 15 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఎమోషనల్‌ అయ్యాడు హిట్‌మ్యాన్‌. సోషల్‌ మీడియా ద్వారా ఓ హృదయపూర్వక సందేశాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

మీ ప్రేమకు ..

ఇవి కూడా చదవండి

‘నాకు ఇష్టమైన టీమిండియా జెర్సీలో 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి నేటితో 15ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఎంతో గొప్ప ప్రయాణం. తప్పకుండా నా జీవితాంతం దీనిని ఓ స్పెషల్‌గా భావిస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేనో అంతర్జాతీయ ప్లేయర్‌గా మారానంటే కొందరు వ్యక్తులు నాకందించిన సాయమే కారణం. క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకులందరికీ ధన్యవాదాలు. జట్టు పట్ల మీకున్న ప్రేమ, మీ మద్దతు వల్లనే మనమందరం అనివార్యంగా ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించాం. ప్రస్తుతం భారత క్రికెటర్ల పట్ల మీరు చూపుతున్న ప్రేమాభినాలు మన జట్టును ఈ స్థాయిలో ఉంచాయి. మీ అందరికీ ధన్యవాదాలు’ అని రోహిత్ తన లెటర్‌లో రాసుకొచ్చాడు రోహిత్‌. కాగా టీమిండియా తరపున 228 వన్డేల్లో 9,283 పరుగులు చేశాడు రోహిట్‌. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 44 టెస్టుల్లో 8 సెంచరీల సాయంతో 3076 పరుగులు, 124 టీ20ల్లో 3,308 పరుగులు సాధించాడు. కాగా విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగడంతో టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు హిట్‌ మ్యాన్‌. కాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ హోదాలో రోహిత్‌కు విదేశాల్లో ఇదే తొలి సిరీస్‌ కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..