IPL 2024: వామ్మో.. వాళ్లిద్దరు గలీజ్ ఫెల్లోస్.. వాళ్లతో రూం అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
IPL 2024: కపిల్ శర్మ ఈ ఇద్దరు క్రికెటర్లను తన షోలో పిలిచారు. అక్కడ ఇద్దరూ చాలా బహిరంగంగా మాట్లాడారు. అదే సమయంలో పలువురు క్రికెటర్ల రహస్యాలు కూడా బయటపడ్డాయి. ఇలాంటిదే ఒకటి రోహిత్ శర్మ కెరీర్‌లో చోటు చేసుకుంది. రోహిత్ శర్మ తన తోటి క్రికెటర్లలో ఎవరితో గదిని ఎప్పుడూ పంచుకోడంట. ఆ కారణం తెలిస్తే చాలా ఆశ్చర్యపోవాల్సిందే.

IPL 2024: గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో మరలా మొదలైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్ ఎట్టకేలకు వచ్చింది. అదేనండీ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్‌లతో ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. కపిల్ శర్మ ఈ ఇద్దరు క్రికెటర్లను తన షోలో పిలిచారు. అక్కడ ఇద్దరూ చాలా బహిరంగంగా మాట్లాడారు. అదే సమయంలో పలువురు క్రికెటర్ల రహస్యాలు కూడా బయటపడ్డాయి. ఇలాంటిదే ఒకటి రోహిత్ శర్మ కెరీర్‌లో చోటు చేసుకుంది. రోహిత్ శర్మ తన తోటి క్రికెటర్లలో ఎవరితో గదిని ఎప్పుడూ పంచుకోడంట. ఆ కారణం తెలిస్తే చాలా ఆశ్చర్యపోవాల్సిందే.
ఆ ఇద్దరు క్రికెటర్లతో రోహిత్ గదిని అస్సలు పంచుకోడంట..
కపిల్ రోహిత్‌ని ఇదే విషయమై ఓ ప్రశ్న అడిగాడు. అతను మొదట ఈ విషయంపై శ్రేయాస్ అయ్యర్‌తో మాట్లాడాడు. ప్రతి క్రికెటర్‌కు తన స్వంత ప్రత్యేక గది ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. నేను ఏ ఆటగాడితోనైనా రూం పంచుకునే అవకాశం వచ్చినా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లతో అస్సలు గదిని పంచుకోను. నన్ను క్షమించండి. కానీ, నేను ఈ ఇద్దరితో గదిని పంచుకోలేను. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ఇద్దరు తమ దుస్తులను ఎక్కడ పడితే అక్కడ విసేరేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
రోహిత్ ఇంకా మాట్లాడుతూ.. తన గది ఎప్పుడూ డీఎన్‌డీలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇద్దరు రాత్రి ఒటి గంటకు నిద్రపోతారు. ఇటువంటి పరిస్థితిలో హౌస్ కీపింగ్ వ్యక్తి ఉదయం వచ్చి వాళ్ల గదిని శుభ్రం చేస్తాడు. వాళ్లద్దరి గది 3-4 రోజులు ఇలాగే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో నేను వాళ్లతో గదిని పంచుకోలేను.
ముంబై-ఢిల్లీ ఢీ..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పటివరకు రోహిత్ బ్యాట్ నుంచి భారీ స్కోరు రాలేదు లేదా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ విజయం సాధించలేదు. ముంబై జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఆ జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌కి ముందు అందరి చూపు రోహిత్ శర్మపైనే ఉంది. వాంఖడే మైదానంలో రోహిత్ శర్మ రికార్డు గురించి మాట్లాడితే, ఈ బ్యాట్స్‌మెన్ మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ 2020 పరుగులు చేశాడు. ఈ మైదానంలో రోహిత్ అత్యధిక స్కోరు 94. అతని స్ట్రైక్ రేట్ 133.86. రోహిత్ సగటు 32.58. రోహిత్ శర్మ 187 ఫోర్లు, 82 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..