Hardik Pandya: షాక్‌లపై షాక్‌లు.. హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్.. అదేంటో తెలుసా?

|

Jul 21, 2024 | 4:32 PM

Hardik Pandya: 2023 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడి టోర్నీ నుంచి సగంలోనే నిష్క్రమించాడు. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా హార్దిక్ దూరమయ్యాడు.

Hardik Pandya: షాక్‌లపై షాక్‌లు.. హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్.. అదేంటో తెలుసా?
Hardik Pandya
Follow us on

Hardik Pandya: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసి హార్దిక్ పాండ్యాకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ షాక్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ మరో షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదేమిటంటే.. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలంటే తన బౌలింగ్‌తో సత్తా చాటాల్సి ఉంటుందనే కండీషన్ పెట్టాడంట. అయితే అది టీమ్ ఇండియా తరపున కాదండోయ్.. అలా కాకుండా డిసెంబరులో జరగనున్న విజయ్ హజారే టోర్నీలో సత్తా చాటాల్సి ఉంటుందని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

అంటే హార్దిక్ పాండ్యా భారత్ వన్డే జట్టులో చోటు దక్కించుకోవాలంటే విజయ్ హజారే టోర్నీ మ్యాచ్‌లలో 10 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవుతాడంట.

గత వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడి టోర్నీ నుంచి సగంలోనే నిష్క్రమించాడు. అంతే కాకుండా వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా హార్దిక్ దూరమయ్యాడు. దీంతో అతని బౌలింగ్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా దేశవాళీ టోర్నీ ద్వారా భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేయాలని హార్దిక్ పాండ్యాకు చెప్పినట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు డిసెంబర్‌లో విజయ్ హజారే టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్ పర్యవేక్షించబడుతుంది. ఆ తర్వాతే వన్డే జట్టుకు ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

తద్వారా 2025 ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే హార్దిక్ పాండ్యా దేశవాళీ వన్డే క్రికెట్‌లో తన బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. లేకుంటే వారిని ఎంపికకు పరిగణించరు. కాబట్టి తదుపరి విజయ్ హజారే టోర్నీ హార్దిక్ పాండ్యాకు అగ్నిపరీక్ష కానుంది.

కేవలం 6 ODIలు..

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడనుంది. మిగిలినవి టీ20, టెస్టు మ్యాచ్‌లు. తద్వారా డిసెంబర్‌లో జరిగే విజయ్ హజారే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో అవకాశం దక్కే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..