టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. శత్రుదేశమైన పాక్‌లోనూ అతనికి పెద్ద ఎత్తున ఫ్యా్న్స్ ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. తాజాగా విరాట్ అభిమానుల జాబితాలో మరొకరు చేరారు. అతనే పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సింగర్ అసిమ్ అజార్. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ తర్వాత పాక్ గాయకుడు అజార్ విరాట్ కోహ్లీని కలిశాడు. ఈ సమావేశానికి ముందు అతను విరాట్ అభిమాని మాత్రమే. కానీ కోహ్లీని కలిసిన తర్వాత అతనికి సూపర్ ఫ్యాన్‌గా మారిపోయాడంటున్నాడు. పాక్ సింగర్ ఇంత సంబరపడిపోవడానికి కారణంమేంటో తెలుసా? కోహ్లీ అతనిని రిసీవ్ చేసుకున్న తీరు, అదేవిధంగా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన టీషర్ట్‌ను బహుమతిగా ఇవ్వడమే. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు అజార్. విరాట్‌తో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ ఈ మ్యాచ్‌కు ముందు నేను కేవలం కోహ్లీకి అభిమాని మాత్రమే. కానీ మెల్‌బోర్న్ మ్యాచ్ తర్వాత ఆయన వ్యక్తిత్వానికి సూపర్ ఫ్యాన్‌గా మారిపోయాను. నాకోసం నీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్స్ కోహ్లీ’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు పాక్ సింగర్.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కోహ్లీ క్రేజ్ అంటే అట్లుంటది మరి.. అతని ఆటతీరు, వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే నంటూ విరాట్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో , భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్ 53 బంతుల్లో 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు. కాగా ఇటీవల లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ ఓ పాక్ అభిమాని కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘విరాట్ కోహ్లీ.. రిటైర్ అయ్యేలోపు పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడు ప్లీజ్’ అని ప్లకార్డును పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.
I was always a fan of your cricket, but now a bigger fan of the person you are.
Thank you for your time and kindness @imVkohli bhai. ♥️ pic.twitter.com/snLZAlBGAG
— Asim Azhar (@AsimAzharr) October 24, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..