T20 Cricket: జీరోకే ఆరుగురు ఔట్.. 13 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్.. టీ20ల్లో అత్యంత చెత్త జట్టు ఇదే..

|

Sep 10, 2024 | 6:30 AM

T20 World Cup Qualifiers: కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే ఆలౌటయి టీ20 క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరుకు ఇన్నింగ్స్ ముగించిన మంగోలియా జట్టు.. ఇప్పుడు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మలేషియాలోని యూకేఎం ఓవల్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మంగోలియన్‌ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసి 31 పరుగులకే ఆలౌటైంది.

T20 Cricket: జీరోకే ఆరుగురు ఔట్.. 13 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్.. టీ20ల్లో అత్యంత చెత్త జట్టు ఇదే..
Malaysia Beat Mongolia
Follow us on

T20 World Cup Qualifiers: కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే ఆలౌటయి టీ20 క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరుకు ఇన్నింగ్స్ ముగించిన మంగోలియా జట్టు.. ఇప్పుడు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మలేషియాలోని యూకేఎం ఓవల్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మంగోలియన్‌ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసి 31 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించిన మలేషియా జట్టు కేవలం 13 బంతుల్లోనే విజయం సాధించింది.

16 ఓవర్లలో కేవలం 31 పరుగులు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా 16.1 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేసింది. విశేషమేమిటంటే.. ఆ జట్టులోని ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేక సున్నాకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ మోహన్ వివేకానందన్ 26 బంతుల్లో 8 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్ 4 పరుగుల కంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. ఆసక్తికరంగా, ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మంగోలియన్ బ్యాట్స్‌మన్ మాత్రమే ఏకైక బౌండరీని కొట్టాడు. ఎంఖ్‌బాత్ బత్‌ఖుగ్ 5 బంతుల్లో ఒక బౌండరీతో 4 పరుగులు చేశాడు.

విరందీప్ సింగ్ అద్భుత బౌలింగ్..

మలేషియా తరపున విరణ్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వీరితో పాటు రిజ్వాన్ హైదర్, పవన్‌దీప్ సింగ్, విజయ్ ఉన్ని, మహ్మద్ అమీర్, సయ్యద్ అజీజ్ ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

సయ్యద్ అజీజ్ తుఫాన్ బ్యాటింగ్..

మంగోలియా ఇచ్చిన 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మలేషియా కెప్టెన్ సయ్యద్ అజీజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 281.82 స్ట్రైక్ రేట్ వద్ద అజేయంగా 31 పరుగులు చేశాడు. కాకపోతే జుబైద్ 3 పరుగుల సహకారం అందించాడు. ఈ ఓటమితో మంగోలియా టీ20 ప్రపంచకప్‌ అర్హత కల కూడా గల్లంతైంది. మంగోలియా గతంలో కువైట్, హాంకాంగ్, మయన్మార్, సింగపూర్, మాల్దీవుల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మంగోలియా 6 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..