Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: 4 పరుగులకే 4 వికెట్లు.. 7వ నెంబర్‌ బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.!

టీ20 ప్రపంచకప్ 2021 ముగిసింది. ఇక ఇప్పుడు అన్ని జట్ల దృష్టి అంతా కూడా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ పైనే.. దీని కోసం...

Cricket News: 4 పరుగులకే 4 వికెట్లు.. 7వ నెంబర్‌ బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2021 | 9:30 PM

టీ20 ప్రపంచకప్ 2021 ముగిసింది. ఇక ఇప్పుడు అన్ని జట్ల దృష్టి అంతా కూడా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ పైనే.. దీని కోసం వివిధ ఖండాల్లో ప్రస్తుతం క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్ నవంబర్ 17న జరిగింది. ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో కెన్యా, ఉగాండా జట్లు తలబడ్డాయి. ఇందులో కెన్యా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఉగాండా చివరి బంతి వరకు వచ్చి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. చివరి బంతికి సిక్స్ కొట్టినా కూడా గెలవలేకపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ టార్గెట్‌ను చేధించే క్రమంలో ఉగాండా జట్టు ఏడు వికెట్ల నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య చేధనలో భాగంగా ఉగాండా జట్టు 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేష్ నక్రానీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాలని ప్రయత్నించాడు. 32 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే తృటిలో విజయం చేజారింది.

4 పరుగులకే 4 వికెట్లు…

లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఉగాండా జట్టుకు ఆరంభంలో దెబ్బ తగిలింది. ఓపెనర్ సౌద్ ఇస్లామ్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో సైమన్ సెసాజీ (1), రౌనక్ పటేల్ (1) వరుసగా రెండు బంతుల్లో పెవిలియన్ బాట పట్టారు. తర్వాత రిజత్ అలీ షా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో ఉగాండా స్కోరు నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక 12 పరుగుల వద్ద కెప్టెన్ బ్రియాన్ మసాబా ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోర్ 35 పరుగులు.

దినేష్ మొత్తం కథను మార్చేశాడు..

35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఉగాండా జట్టును దూసెడిట్ ముహుముజా, దినేష్ నక్రానీ కాపాడారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 84 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే దినేష్ తన అర్ధ సెంచరీని 32 బంతుల్లో పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత దినేష్ పెవిలియన్ బాట పట్టాడు. దీనితో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఉగాండా విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి మూడు బంతుల్లో 10 పరుగులు రాబట్టగా.. తర్వాతి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు మాత్రమే రాబట్టగలిగారు ఉగాండా బ్యాటర్లు.. దీనితో ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.