AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ఫైనల్‎లో గెలుపు ఎవరిది.. చరిత్రను పునరవృతం చేస్తారా.. ఈ టీ20 వరల్డ్ కప్‎లో ఆస్ట్రేలియా ప్రస్థానం..

టీ20 ప్రపంచ కప్‎లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్‎లో తలపడనున్నాయి. నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈ మెగా టోర్నమెంట్‎కు ముందు ఆస్ట్రేలియాపై భారీ అంచనాలు ఏమి లేవు...

T20 World Cup 2021: ఫైనల్‎లో గెలుపు ఎవరిది.. చరిత్రను పునరవృతం చేస్తారా.. ఈ టీ20 వరల్డ్ కప్‎లో ఆస్ట్రేలియా ప్రస్థానం..
Final
Srinivas Chekkilla
|

Updated on: Nov 12, 2021 | 6:08 PM

Share

టీ20 ప్రపంచ కప్‎లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్‎లో తలపడనున్నాయి. నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈ మెగా టోర్నమెంట్‎కు ముందు ఆస్ట్రేలియాపై భారీ అంచనాలు ఏమి లేవు. ఆసీస్ జట్టు కాగితంపై బలంగా కనిపించినా.. ఇటీవల ఆటగాళ్ల ఫామ్‌, వేదిక, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆసీస్ కంటే పాకిస్తాన్ మెరుగైన జట్టుగా కనిపించింది. అప్పటికీ పాక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‎కు చేరితే.. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాతో సమాన స్థితిలో ఉండి రన్ రేట్‎తో గట్టెక్కి సెమీస్‏కు చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఐదు మ్యాచ్‎లు ఆడిన ఆసీస్ నాలుగింటిలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‎లో అతికష్టం మీద కంగారులు చివరికి విజయం సాధించారు.

119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు 28 బంతుల్లో 38 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన స్టోనియిస్, మాథ్య్ వేడ్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిచారు. స్టోయినిస్ 24 బంతుల్లో 16, వేడ్ 10 బంతుల్లో 10 చేసి దక్షిణాఫ్రికాపై గెలుపొందారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై చేతిలో ఘోర ఓడిపోయారు. కానీ శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‎పై గెలుపొందినెట్ రన్ రేట్‌తో సెమీస్‌కు చేరారు. సెమీస్ స్టోనియిస్, వేడ్ ద్వయం మరోసారి విజృంభించడంతో పాకిస్తాన్‎పై విజయం సాధించారు. ఇద్దరూ కలిసి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు. 46 బంతుల్లో 81 పరుగులు అవసరమైన దశలో స్టోయినిస్ 31 బంతుల్లో 40, ముఖ్యంగా వేడ్ 17 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియాను ఫైనల్లోకి దూసుకెళ్లింది.

19వ ఓవర్‌లో హసన్ అలీ జారవిడిచిన క్యాచ్ పాక్ ఓడిపోవడానికి కారణంమని చాలా మంది చెబుతున్నారు. అదే మ్యాచ్‎లో పాక్ బ్యాటింగ్ అప్పుడు డెవిడ్ వార్నర్, స్మిత్ క్యాచులు వదిలేశారు. మంచు కురుస్తున్న వేళ బంతిని పట్టుకోవడం అలీకి కష్టంగా మారింది. అతడు ఈ టోర్నమెంట్‎లో మంచి ఫామ్‎లో ఉన్నాడు. కానీ క్యాచ్‌లు మిస్ అవడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ కొన్ని క్యాచులు మ్యాచ్‎లను గెలిపిస్తాయి. బాబర్ ఆజం బహుశా మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో దాని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడి ఉండవచ్చు. హసన్ అలీ విడిచిన క్యాచ్ ముఖ్యమైనదే అయినప్పటికీ మ్యాచ్ ఓడిపోవడానికి అదొక్కటే కారణం కాదు. హసన్ అలీకి 2016 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ను గుర్తు చేయాలి. అక్కడ బెన్ స్టోక్స్‌ బౌలింగ్‎లో వెస్టిండీస్ ఆటగాడు బ్రాత్వైట్ నాలుగు సిక్సులు కొట్టి వారి దేశానికి కప్ అందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‎లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సులు కొట్టాడు. మ్యాచ్‎ల్లో ఇలాంటి జరగడం సాధారణం. టోర్నమెంట్‌లో చాలా బాగా ఆడిన పాకిస్థాన్ హసన్ అలీ క్యాచ్‌ని జారవిడుచుకునే ముందు కొన్ని పొరపాట్లు చేసింది. అనేక రన్-అవుట్ ప్రయత్నాలు చేసి విఫలమైంది. చాలా కీలకమైన సమయాల్లో పాకిస్థానీలు ఒక్కసారి కూడా స్టంప్‌లను కొట్టలేకపోయారు.

ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో తమ అత్యుత్తమ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని పాకిస్తాన్ కెప్టెన్ నిర్ణయించడంతో ఆస్ట్రేలియా చివర్లో పరుగులు చేయలేదనకున్నారు. పాక్ మధ్యలో ఉండగానే తమ బలహీన బౌలర్ల స్పెల్‌లను పూర్తి చేయించింది. డెత్ ఓవర్లలో ఒత్తిడితో వికెట్లు తీయాలనకుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ వారి ప్రణాళికకు సరిగా అమలు కాలేదు. బాబర్ అజామ్ స్ట్రైక్ రేట్ 115, రిజ్వాన్ 129గా ఉంది. పాకిస్తాన్ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. వారు అక్కడి నుండి వేగం పెంచారు. అయితే 15 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేశారు. అప్పటికీ వారు సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదు. ఎందుకంటే వారి బ్యాటింగ్ లైనప్‌లో చాలా మంది అద్భుతమైన హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్ నాణ్యతతో ఒక ఓవర్ లేదా రెండు ఓవర్లు పాకిస్తాన్‌ను కట్టడి చేసే అవకాశం ఉంది. అది కీలకమైన 19వ ఓవర్‌లో జరిగింది. ఆ ఓవరులో కమిన్స్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినప్పటికీ చివరి నాలుగు ఓవర్లలో పాక్ 54 పరుగులు రాబట్టింది. కాని పాక్ 186 నుంచి 189 పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ స్వింగ్‌ను సరైన రీతిలో ఉపయోగించకోలేదు. వాసిమ్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ 17 పరుగులు రాబట్టాడు.

అంతకు ముందు రోజు జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లాడ్ సెమీ-ఫైనల్‎లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. కివీస్ చివరి నాలుగు ఓవర్లలో 50 ప్లస్ పరుగులు అవసరం. ఈ దశలో నీషమ్ క్యాచ్‎ను లివింగ్స్టోన్ సరిగా పట్టుకోలేకపోయాడు. దీంతో నీషమ్, మిచెల్ చెలరేగి ఆడి జట్టును గెలిపించారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఇలా కీలక క్యాచ్‎లు మిస్సయ్యాయి. కవీస్, ఇంగ్లాండ్ మ్యాచ్‎లో జోర్డాన్ బౌలింగ్‎లో క్యాచ్ మిస్ కాగా.. ఆసీస్, పాక్ మ్యాచ్‎లో అఫ్రిది బౌలింగ్‎లో క్యాచ్ మిస్ అయింది. 2010 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ఫేవరెట్‌గా ఉంది. అప్పుడు క్రీజులో మైఖేల్ హస్సీ, కామెరాన్ వైట్ ఉన్నా్రు. హస్సీ 24 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.

2010లో జరినట్టే ఇప్పుడు జరిగింది. ఆస్ట్రేలియా కిల్లర్ ఇన్‌స్టింక్ట్‌తో ఈ రకమైన పవర్ గేమ్‌ను ప్రదర్శిస్తుంది. ఆస్ట్రేలియా ఇప్పుడు ఫైనల్‌లో ఫేవరెట్‌గా ఉంటుంది. 2015 ప్రపంచ కప్, 2019 ప్రపంచ కప్ ఫైనలల్లో ఓడిపోయిన కవీస్‎కు ఆసీస్‎తో పోరు అంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‎లో టాస్, ఛేజింగ్ ముఖ్యం. చాలాసార్లు ఛేజింగ్ జట్లే విజయం సాధించాయి.

Read Also.. T20 World Cup 2021: వారిద్దరు మ్యాచ్‎ను మలుపు తిప్పారు.. ఆస్ట్రేలియాపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు..

T20 World Cup 2021: అది అతడికి జట్టుపై ఉన్న నిబద్ధత .. ఆ పాక్ ఆటగాడిని ఆకాశానికెత్తిన వీవీఎస్ లక్ష్మణ్..