AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: డేవిడ్ వార్నర్ సిక్స్‎పై విమర్శలు.. సరైన పద్ధతి కాదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు..

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే మహ్మద్ హఫీజ్ వేసిన బంతిని సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించాడు...

T20 World Cup 2021: డేవిడ్ వార్నర్ సిక్స్‎పై విమర్శలు.. సరైన పద్ధతి కాదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు..
Warner
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 12, 2021 | 7:19 PM

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే మహ్మద్ హఫీజ్ వేసిన బంతిని సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించాడు. పాక్ బౌలర్ హఫీజ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో తొలి బంతి అతని చేతి నుంచి జారిపోయి రెండుసార్లు బౌన్స్ అయింది. వార్నర్ ముందుకు వచ్చి దానిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వచ్చిన నోబాల్‌లో వార్నర్‌కు మరో రెండు పరుగులు వచ్చాయి. ఆ సిక్సర్ కారణంగా ఆ ఓవర్లో ఆస్ట్రేలియాకు 13 పరుగులు రాబట్టింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. “వార్నర్ ఆట క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు! ఏమి చెప్పాలి?” హఫీజ్ చేతిలో నుంచి డెలివరీ జారిపోవడంతో వార్నర్ దానిని వదిలేసి ఉండాల్సిందని గంభీర్ ట్వీట్ చేశాడు.

అయితే అలాంటి డెలివరీని డెడ్‌గా పరిగణించాలని రూల్ లేదు. ఐపీఎల్‌లో నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో జోస్ బట్లర్‌ను రనౌట్ చేసినందుకు గతంలో విమర్శలు ఎదుర్కొన్న భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, గంభీర్ చేసిన ట్వీట్‌పై స్పందించాడు. “ఇది సరైనది అయితే, అది సరైనది అని అతని ఉద్దేశం. అది తప్పు అయితే, ఇది కూడా తప్పు. సరైన అంచనా?” అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ” నిజంగా అద్భుతమైన హిట్. గొప్ప షాట్,” అని భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రాశాడు. వార్నర్ 30 బంతుల్లో 49 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 34 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు, హాజిల్ వుడ్, జంపా ఒక్కో వికెటు పడగొట్టారు.

Read Also.. Ravi Shastri: రవి శాస్త్రిని కోచ్‎గా నియమించుకునేందుకు ఐపీఎల్ జట్ల ఆసక్తి.. ఇప్పటికే అతడిని సంప్రదించిన ఓ జట్టు యాజమాన్యం..!

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..