AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: భయపెడుతోన్న బ్యాడ్‌లక్.. అదే జరిగితే సెమీఫైనల్‌లో టీమిండియా అస్సాంకే..!

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు సెమీఫైనల్ స్పాట్లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకోగా.. ఈరోజు జరగబోయే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో గ్రూప్-ఏ నుంచి ఏయే జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకుంటాయో చూడాలి.

T20 World Cup: భయపెడుతోన్న బ్యాడ్‌లక్.. అదే జరిగితే సెమీఫైనల్‌లో టీమిండియా అస్సాంకే..!
Team India
Ravi Kiran
|

Updated on: Jun 24, 2024 | 5:45 PM

Share

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు సెమీఫైనల్ స్పాట్లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకోగా.. ఈరోజు జరగబోయే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో గ్రూప్-ఏ నుంచి ఏయే జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకుంటాయో చూడాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే దాదాపుగా రెండో సెమీఫైనల్‌లో గయానా వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. గ్రూప్‌లో టాప్ టీంగా సెమీస్‌లోకి ఎంటర్ అవుతుంది. అలా కాదని ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కూడా పాయింట్ల పట్టికలో భారత జట్టు మొదటి స్థానంలోనే ఉంటుంది. దీని ప్రకారం గ్రూప్-1లోని అగ్రశ్రేణి జట్టు, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్‌లో తలబడుతుంది. తద్వారా గ్రూప్-1లో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంటే, గ్రూప్-2లో ఇంగ్లాండ్ రెండో జట్టుగా ఉంది. దీంతో జూన్ 27న జరిగే 2వ సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడడం దాదాపు ఖాయమైంది. అయితే ఇక్కడే ఓ బ్యాడ్‌లక్ టీమిండియాను భయపెడుతోంది. ఒకవేళ అదే జరిగితే.. సెమీఫైనల్‌లో టీమిండియా టోర్నీ నుంచి ఔట్ అవ్వడం ఖాయం.

ఇది చదవండి: రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

మొదటి బ్యాడ్‌లక్: ఇంగ్లాండ్, జోస్ బట్లర్..

టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన 2వ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు భారత జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సునాసయంగా చేధించింది. ఇందులో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్.

ఆ మ్యాచ్‌లో జోస్.. ది బాస్‌గా మొత్తం టీమిండియా బౌలింగ్ లైనప్‌ను ఊచకోత కోశాడు. ఆ టీ20 ప్రపంచకప్‌లోనూ జోస్ బట్లర్ గ్రూప్ స్టేజి మ్యాచ్‌ల్లో పేలవ ఆటతీరు కనబరిచాడు. అయితే సరిగ్గా జట్టుకు తన అవసరం వచ్చేటప్పటికి.. అన్నీ తానై విజృంభించాడు. కీలక ఇన్నింగ్స్‌లతో అలరించాడు. ఇక ఇప్పుడు కూడా జోస్ బట్లర్, ఇంగ్లాండ్ సెమీఫైనల్‌లో టీమిండియాపై దూకుడైన ఆటతీరు కనబరిస్తే.. రోహిత్ సేన అస్సాంకే అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

రెండో బ్యాడ్‌లక్: గ్రూప్ స్టేజిలో భారత్ జైత్రయాత్ర

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో మాదిరిగానే.. టీ20 ప్రపంచకప్ 2022లో కూడా గ్రూప్ స్టేజి మ్యాచ్‌లన్నింటిలోనూ టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగించింది. కీలక ప్లేయర్స్ అందరూ కూడా చక్కటి ఆటతీరు కనబరిచారు. అయితే సరిగ్గా కీలక మ్యాచ్.. అదీనూ సెమీఫైనల్ ఫీవర్ మాదిరిగా.. ఇంగ్లాండ్ ముందు చతికిలబడ్డారు. చేజేతులా కప్పును ఇంగ్లీష్ టీంకి అప్పగించారు. ఇక ఇప్పుడు కూడా అదే జరిగితే.. టీమిండియా సెమీఫైనల్ నుంచి అవుట్ అవ్వడం ఖాయమేనని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..