AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న ఫ్యూచర్ స్టార్

Shubman Gill Indian Team Captain For Zimbabwe Tour: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్ 2024లో పాల్గొంటోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్‌కు వెళ్లకుండా యువ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఈ కారణంగా, జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించవచ్చని కూడా నివేదికలు వినిపిస్తున్నాయి.

Team India: టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న ఫ్యూచర్ స్టార్
Team India
Venkata Chari
|

Updated on: Jun 24, 2024 | 1:30 PM

Share

Shubman Gill Indian Team Captain For Zimbabwe Tour: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్ 2024లో పాల్గొంటోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్‌కు వెళ్లకుండా యువ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఈ కారణంగా, జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించవచ్చని కూడా నివేదికలు వినిపిస్తున్నాయి.

2024 టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో శుభమాన్ గిల్ ఎంపిక కాలేదు. గిల్‌ను రిజర్వ్ ఆటగాళ్ల కేటగిరీలో ఉంచారు. అయితే, టీమ్ ఇండియా తన న్యూయార్క్ లెగ్‌ను ముగించిన వెంటనే, శుభ్‌మన్ గిల్‌ను తిరిగి ఇండియాకు పంపారు. ఆ తరువాత, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మధ్య వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే, గిల్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కథనాన్ని పంచుకోవడం ద్వారా వివాద వార్తలను ఖండించారు.

భారత జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, రోహిత్ శర్మ గైర్హాజరీలో, టీ20 ప్రపంచకప్ తర్వాత జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియాకు శుభ్‌మన్ గిల్‌ని కెప్టెన్‌గా నియమిస్తారు. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఈ టూర్‌కు వెళ్లరని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, గిల్‌కు కెప్టెన్సీ బాధ్యత ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.

జింబాబ్వే పర్యటనలో టీమిండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. నివేదికల ప్రకారం, ఈ పర్యటనలో కోచింగ్ కోసం గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండడు. వీవీఎస్ లక్ష్మణ్ గురించి చెప్పాలంటే, అతను ఇంతకుముందు చాలాసార్లు భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా కోచ్‌గా ఉన్న ఈ పర్యటనలో ప్రధాన భారత జట్టు వెళ్లలేదు. ఎక్కువగా యువ ఆటగాళ్లు వెళ్లారు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కోచ్‌గా పనిచేసి జట్టుకు బంగారు పతకాన్ని అందించాడు. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..