AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs IND T20 WC Highlights: బదులు తీర్చుకున్న భారత్.. ఆసీస్ పై ఘన విజయం

Australia vs India, T20 World Cup 2024 Highlights: టీమిండియా బదులు తీర్చుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.  టీ20 ప్రపంచకప్‌ సూపర్ -8 మ్యాచ్ లో భాగంగా సోమవారం (జూన్ 24) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

AUS vs IND T20 WC Highlights: బదులు తీర్చుకున్న భారత్.. ఆసీస్ పై ఘన విజయం
Australia vs India, T20 World Cup 2024
Basha Shek
|

Updated on: Jun 25, 2024 | 12:04 AM

Share

Australia vs India, T20 World Cup 2024 Highlights: టీమిండియా బదులు తీర్చుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.  టీ20 ప్రపంచకప్‌ సూపర్ -8 మ్యాచ్ లో భాగంగా సోమవారం (జూన్ 24) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హాట్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగిన భారత్, ఆస్ట్రేలియా జట్లు సూపర్-8 రౌండ్‌లో చివరి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో ఓడిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియాకు మరింత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆసీస్‌కు ఇప్పుడు అత్యవసరం. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోతే ఆ జట్టు ఇంటి బాట పట్టే అవకాశముంది. ‘భారత్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకోవాలని అనుకుంటున్నా’ అని ఆఫ్ఘనిస్థాన్‌పై ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ప్రపంచకప్ 2023 టోర్నీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటములకు ఈ మ్యాచ్ తో బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ నివేదికల ప్రకారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ అనుకున్న సమయానికి ప్రారంభమయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే నేరుగా భారత జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించనుంది. బంగ్లాదేశ్‌ ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధిస్తేనే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు వెళ్లగలదు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 24 Jun 2024 11:48 PM (IST)

    భారత్ విజయం.. ఆసీస్ ఇంటికేనా?

    ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ -8 చివరి మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైంది. మరోవైపు ఆసీస్ సెమీస్ బెర్తు ఆఫ్గాన్, బంగ్లా దేశ్ మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఉండనుంది.

  • 24 Jun 2024 11:36 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    ఆసీస్ బ్యాటర్లంతా పెవిలియన్ చేరుకున్నారు. వరుసగా ఫోర్ ,సిక్సర్ బాది ఊపు మీదున్న టిమ్ డేవిడ్ కూడా ఔటయ్యాడు. అర్ష్ దీప్ బౌలిం గ్ లో అతను బుమ్రా చేతికి చిక్కాడు. ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 39 రన్స్ అవసరం.

  • 24 Jun 2024 11:32 PM (IST)

    వరుసగా వికెట్లు కోల్పోతున్న ఆసీస్..

    రన్ రేట్ పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. అర్ష్ దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన మాథ్యు వేడ్ కుల్ దీప్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది.

  • 24 Jun 2024 11:25 PM (IST)

    ‘హెడ్’ ఏక్ ఔటయ్యాడు..

    టీమిండియాకు కొరక రాని కొయ్యలా మారిన ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసిన అతను బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 20 బంతుల్లో 55 పరుగులు అవసరం.

  • 24 Jun 2024 11:19 PM (IST)

    ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..

    ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రివర్స్ స్వీప్ ఆడే యత్నంలో మార్కస్ స్టోయినిస్ ఔటయ్యాడు. అక్షర్ దీప్ కు ఈ వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 26 బంతుల్లో 60 పరుగులు అవసరం.

  • 24 Jun 2024 11:09 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    ఆసీస్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు ట్రావిడ్ హెడ్ మాత్రం ఫోర్లు, సిక్సర్ల వర్షం  కురిపిస్తున్నాడు.

  • 24 Jun 2024 10:58 PM (IST)

    వంద దాటిన ఆసీస్ స్కోరు

    ఆసీస్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. పది ఓవర్లలోనే ఆ జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 24 Jun 2024 10:50 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    ఆస్ట్రేలియా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 9 ఓవర్లలో ఆసీస్ స్కోరు 91/2.

  • 24 Jun 2024 10:35 PM (IST)

    ఆసీస్ బ్యాటర్ల జోరు..

    మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ లు ధాటిగా ఆడుతున్నారు. భారత బౌలర్ల పై ఎదురు దాడికి దిగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

  • 24 Jun 2024 10:24 PM (IST)

    ధాటిగా ఆడుతోన్న హెడ్, మార్ష్

    ఆసీస్ జోరు పెంచింది. మొదటి వికెట్ కోల్పోయిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వేగంగా పరుగులు చేస్తున్నారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 36/1.

  • 24 Jun 2024 10:22 PM (IST)

    ఆసీస్ మొదటి వికెట్ డౌన్..

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆర్ష్ దీప్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ చేతికి చిక్కాడు వార్నర్.

  • 24 Jun 2024 10:02 PM (IST)

    ముగిసిన టీమిండియా ఇన్నింగ్స్..

    టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. వికెట్లు కూడా వరుసగా పడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది భారత్.

  • 24 Jun 2024 09:48 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. దూకుడగా ఆడే యత్నంలో శివమ్ దూబే (22 బంతుల్లో 28) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195

  • 24 Jun 2024 09:16 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సెంచరీ ముంగిట రోహిత్ ఔట్

    రోహిత్ శర్మ (41 బంతుల్లో 92) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన అతను 8 పరుగుల తేడాతో శతకం మిస్ అయ్యాడు. మిచెల్ స్టార్క బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హిట్ మ్యాన్ బౌల్డ్ అయ్యాడు.

  • 24 Jun 2024 09:05 PM (IST)

    సెంచరీకి చేరువలో రోహిత్..

    రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇప్పటివరకు కేవలం 37 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్ లతో 89 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 114/2.

  • 24 Jun 2024 08:51 PM (IST)

    ఆగని రోహిత్ తుఫాన్..

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.  ఇప్పటివరకు కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్ లతో 76 పరుగులు చేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు

  • 24 Jun 2024 08:40 PM (IST)

    మ్యాచ్ ప్రారంభం.. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ..

    భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. రోహిత్ శర్మ 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి..

  • 24 Jun 2024 08:28 PM (IST)

    మ్యాచ్ కు వర్షం అంతరాయం..

    భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. 4.1 ఓవర్ల దగ్గర వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 43 పరుగులుగా ఉంది.  రోహిత్ (14 బంతుల్లో 35 పరుగులు) చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి.

  • 24 Jun 2024 08:18 PM (IST)

    స్టార్క్ కు చుక్కలు చూపించిన రోహిత్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు చుక్కలు చూపించాడు. మూడో ఓవర్ లో ఏకంగా 4 సిక్స్ లు, ఒక బౌండరీ బాదాడు. ఈ ఓవర్ లో  ఏకంగా 29 పరుగులు వచ్చాయి.

  • 24 Jun 2024 08:09 PM (IST)

    భారత్ కు బిగ్ షాక్..

    టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. హేజిల్ వుడ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి కింగ్ కోహ్లీ ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 6/1.

  • 24 Jun 2024 08:07 PM (IST)

    భారత్ బ్యాటింగ్ ప్రారంభం..

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్ లో రోహిత్ ఒక బౌండరీ కొట్టగా మొత్తం 5 పరుగులు వచ్చాయి. స్టార్క్, హేజిల్ వుడ్ ఆసీస్ తరఫున ఓపెనింగ్ పేసర్లుగా బరిలోకి దిగారు.

  • 24 Jun 2024 08:00 PM (IST)

    సెయింట్ లూసియాలో భారత్ తే ఆధిపత్యం

    సెయింట్ లూసియా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత్ 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో 3 సార్లు గెలిచింది. అంటే ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే గెలిచింది.

  • 24 Jun 2024 07:40 PM (IST)

    ఇరు జట్ల వివరాలివే.

    భారత్ (ప్లేయింగ్ XI):
    రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
    ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
    ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

  • 24 Jun 2024 07:36 PM (IST)

    టాస్ ఓడిన టీమిండియా..

    ఈ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచాడు. ముందుగా టీమిండియాను బ్యాటిం గ్ కు ఆహ్వానించాడు.

Published On - Jun 24,2024 7:34 PM