Video: మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. గ్రౌండ్‌లోనే సంకెళ్లేసిన పోలీసులు.. కట్‌చేస్తే.. హిట్‌మ్యాన్ ఏం చేశాడంటే?

Rohit Sharma Fan Breached the Field: మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్-విరాట్ అభిమానులు మైదానంలోకి పరుగులు తీసిన ఘటన ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఎస్‌ఎలో కూడా ఇలాంటి సంఘటన కనిపించింది. ఆ తర్వాత పోలీసులు చర్య తీసుకున్నారు.

Video: మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. గ్రౌండ్‌లోనే సంకెళ్లేసిన పోలీసులు.. కట్‌చేస్తే.. హిట్‌మ్యాన్ ఏం చేశాడంటే?
Rohit Sharma Fan Video

Updated on: Jun 02, 2024 | 9:49 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. ఐసీసీ ఈ మెగా ఈవెంట్‌లో జూన్ 5న టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లో సత్తా చాటింది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓ కలకలం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు రోహిత్ కళ్ల ముందే పట్టుకున్న తీరుపై సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

మైదానంలోకి ఎంట్రీ..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. రోహిత్ శర్మ అభిమానిని అమెరికా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అతను చేసిన తప్పు ఏమిటి? అంటూ చర్చలు మొదలు పెట్టారు. అమెరికా పోలీసులు రోహిత్‌ అభిమానిని అరెస్ట్‌ చేసిన తప్పిదానికి కారణం అతడు మైదానంలోకి దిగడమే. ఈ అభిమాని వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మను కలవడానికి మైదానంలోకి ప్రవేశించాడు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇది చోటు చేసుకుంది. మైదానంలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసిన USA భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

మైదానంలో సంకెళ్లు వేసిన పోలీసులు..

రోహిత్ అభిమాని పట్టుబడడంపై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రోహిత్‌ను చేరుకున్న అభిమాని దగ్గరకు వచ్చిన USA పోలీసులు.. అతనిని నేలపైకి విసిరి, ఆపై చేతికి సంకెళ్ళు వేసిన తీరును చూసి, సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మెక్సికో సరిహద్దులో గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నట్లు అమెరికా పోలీసులు ప్రవర్తించారని ఒకరు కామెంట్ చేశారు. రోహిత్ అభిమాని అమెరికాలో మైదానంలో పెద్ద తప్పు చేశాడని మరొకరు కామెంట్ చేశారు. అక్కడ ఇలాంటివి చేస్తే ఎవరైనా చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

పోలీసులను రిక్వెస్ట్ చేసిన రోహిత్ శర్మ..

అయితే, పోలీసులు ఆ అభిమానిని కింద పడేసి, చేతులు వెనకాలే పెట్టి, సెంకెళ్లు వేస్తున్నారు. ఇందంతా రోహిత్ కళ్లెదుటే ఇదంతా చోటు చేసుకుంది. కాగా, అభిమానిని ఇలా చేయడంతో రోహిత్ తట్టుకోలేకపోయాడు. దీంతో పోలీసులతో మాట్లాడాడు. అతనిపై కొంచెం సాఫ్ట్‌గా వెళ్లాలని కోరాడు.

వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో విజయం..


వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే, భారత జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తరపున పంత్, పాండ్యా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 40 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 53 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ 19 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్క డ క్లిక్ చేయండి..